మంచిర్యాల టౌన్, నవంబర్ 30 : నేడు హైదరాబాద్ లో నిర్వహించే మాలల సింహగర్జన సభకు, నేతకానీల కు ఎలాంటి సంబంధం లేదని, ఆ సభకు కులస్తులెవ్వ రూ వెళ్లవద్దని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య స్పష్టం చేశారు. శనివారం మంచిర్యాలలోని నేతకాని భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేశ్‌తో కలిసి మాట్లాడారు. మాలల సింహగర్జన సందర్భంగా రూపొందించిన ఫ్లెక్సీలో తనతో పాటు మాజీ ఎంపీ వెంకటేశ్ నేత ఫొటోను అనుమతి లేకుండా ముద్రించారని తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివే క్ ప్రభుత్వానికి, ప్రజలకు తప్పుడు సంకేతాన్ని అందించాలని చూస్తున్నారన్నారు.
మాలల ఉపకులాలన్నీ ఒక్క టే అని చూపించి.. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా తమ జనాభా ఉందని చెప్పి మంత్రిపదవిని చేజిక్కించుకోవాలని చూస్తున్నారని, వారి స్వలాభం కోసం మాలల్లో ఉన్న ఉపకులాలను వాడుకుంటున్నారని మండిపడ్డారు. నిజంగా మాలల మీద ప్రేమ ఉంటే కాకా కుటుంబంలో కాకుండా ఇతర కుటుంబాలకు చెందిన వారిని చట్టసభల్లోకి తీసుకురావాలని కోరారు. ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ నియోజకవర్గాల్లో కాకా కుటుంబమే పోటీ చేస్తుందని, రిజర్వేషన్ అంటే గడ్డం కుటుంబమే అన్నట్లు వ్యవహరిస్తున్నారని, పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏ ఒక్క ఎస్సీ నాయకుడిని ఎదగకుండా వీరు అడ్డు పడుతున్నారని ఆరోపించారు.
నేతకాని అనేది ఉపకులం అ ని, మాలలు 30 లక్షల మంది ఉన్నట్లు చెబుతున్నారని, కానీ అందులో నేతకానీలు 18 లక్షల మంది ఉన్నారని చెప్పారు. తాము నిజమైన అంబేద్కర్ వారసులమని చె ప్పుకొచ్చారు. నేతకాని కులస్తులు వారి మాటలు నమ్మి మోసపోవద్దని, చిన్నచిన్న పదవులు ఇచ్చి మోసం చేసేందుకు వివేక్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. నేతకాని కులానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం న్యాయం చేయాలంటే ఎమ్మెల్సీ లేక రాజ్యసభ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చట్ట సభల్లో నేతకానీలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో నేతకాని మహర్ సంక్షే మ సంఘం స్టీరింగ్ కమిటీ చైర్మన్ దుర్గం నర్సయ్య, పొలిట్‌బ్యూరో చైర్మన్ సెగ్యం రాజేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామెర ప్రకాశ్, అధికార ప్రతినిధి గోళ్ల రాయమల్లు, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు అనపర్తి యువరాజు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సునార్కర్ రాంబాబు, నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్, మంచిర్యాల జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కామెర అనూష, నాయకులు దుర్గం నగేశ్, కామెర శ్రీనివాస్, కొండగొర్ల శ్రీనివాస్, దుర్గం విశ్వనాధ్, సంతోష్, జుమ్మిడి లక్ష్మి, బెంబడి దుర్గయ్య పాల్గొన్నారు.