బోథ్, జూలై 7 : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని అందూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒక్కరే ఉపాధ్యాయుడు దిక్కయ్యారు. ఒకటి నుంచి ఐదు తరగతి వరకు 39 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇది వరకు ఇక్కడ ఇ ద్దరు ఉపాధ్యాయులు పని చేస్తుండే వారు. గత జనవరి 3న ఇక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఒక్కరే ఉపాధ్యాయుడు ఉండడంతో గ్రామస్తులు అప్పట్లో సమావేశం ఏర్పాటు చేశారు.
సర్పంచ్ పెం దూర్ పృథ్వీరాజ్ భార్య పెందూర్ పుష్పలత స్వచ్ఛందంగా పాఠాలు బోధించేందుకు ముందుకు రావడంతో వేసవి సెలవు ల వరకు పాఠాలు బోధించేందుకు ఒప్పించారు. కాగా ప్రస్తుతం పాఠశాలలు తెరుచుకొని నెల రోజులు గడుస్తున్నా విద్యా శాఖాధికారులు మరో ఉపాధ్యాయున్ని నియమించ లేదు.
ఇది వరకు స్వచ్ఛందంగా పా ఠాలు బోధించిన పుష్పలత డెలివరి కావడంతో పాఠశాలకు రావడం లేదు. ప్రస్తు తం ఉన్న ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు పాఠాలు చెప్పడం ఇబ్బందిగా మారిం ది. నెల వారి సమావేశాలు, రికార్డుల నిర్వహణ తదితర వాటికే సమయం వెచ్చించాల్సి వస్తుంది. దీంతో పాఠాలు చెప్పడం ఇబ్బందికరంగా మారింది.
విద్యా శాఖాధికారులు స్పందించి ఇక్కడ ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరో ఉపాధ్యాయుడిని తాత్కాలికంగా అయినా నియమించాలని గిరిజనులు కోరుతున్నారు. ఈ విషయమై మండల విద్యా శాఖాధికారి మహముద్ హుస్సేన్ను సంప్రదించగా మండలంలోని 12 పాఠశాలల్లో ఉపాధ్యాయుల అవసరాన్ని గుర్తిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపించమన్నారు. సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.