గత నెలలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేశాయి. వర్షం, వడగండ్లతో వరి పైరు నేలవాలగా.. చివరి దశలో ఏరనున్న పత్తి నల్ల బడింది. వీటికి తోడు ఈదురుగాలులు, వడగండ్లతో పింద దశలో ఉన్న మామిడి కాయలు రాలాయి. కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ మినహా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో 1,732 ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.1.73 కోట్లు విడుదల చేశారు. త్వరలోనే 1407 మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ కానున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల్లోనే పరిహారం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
మంచిర్యాల, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గత మార్చిలో కురిసిన అకాల వర్షాలు రైతులను నష్టపరిచాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు పంటలపై తీవ్ర ప్ర భావం చూపాయి. మబ్బులకు తెగుళ్లు వచ్చా యి. వర్షం, వడగండ్ల వాన చేతికొచ్చిన పంట ను దెబ్బసింది. పూత, పొట్ట దశ, గొలకలు వేసిన వరి పైరు నేల రాలింది. చివరి దఫా తీయనున్న పత్తి తడిసి నల్లబడింది. మక్క, జొన్న నేల కొరిగింది. వీటికి తోడు ఈదురు గాలులు, వడగండ్లతో పింద దశలో ఉన్న మామిడి కాయలు రాలాయి. నీరు నిలిచి కూ రగాయలు కుళ్లిపోయాయి. రైతుల కష్టాలు చూసి సీఎం కేసీఆర్ వరంగల్, ఖమ్మం జిల్లా ల్లో పర్యటించారు. నష్టపోయిన పంటను చూసి చలించిన ఆయన దేశంలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ఎకరాలకు రూ.10 వేల నష్ట పరిహారం ప్రకటించారు. సాధ్యమైనంత తొందరగా చెల్లిస్తామని భరోసా ఇచ్చా రు. ఇచ్చిన మాటకు కట్టుబడి నెల రోజులు తిరక్క ముందే పరిహారం పంపిణీకి నిధులు విడుదల చేశారు. దీంతో పంట నష్టం బాధలో ఉన్న రైతులకు ఉపశమనం లభించనుంది. పెట్టుబడికి రూ.10 వేల సాయం చేసి, నష్టపోతే రూ.10 వేలు ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ ఒక్కటే అని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ మి నహా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లా ల్లో పంట నష్టం వాటిల్లింది. వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. ఆ వివరాలన్నీ సేకరించిన వ్యవసాయ శాఖ 33 శాతం కంటే ఎక్కువ నష్టపోయిన రైతుల పేర్లను పరిహారానికి ప్రతిపాదించింది. మంచిర్యాల జిల్లాలో జన్నారం, దండేపల్లి, హాజీపూర్లలో 307 ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, నేరడిగొండ మండలాల్లో 1,002 ఎకరాలు.. నిర్మల్ జిల్లాలోని భైంసా, లోకేశ్వరం, దిలావర్పూర్, కడెం, ముథోల్, నర్సాపూర్, పెంబి, సారంగాపూర్, తానూర్ మండలాల్లో 423 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా.. రూ.1.73 కోట్ల పరిహారం చెల్లించనున్నారు.
జిల్లాలో వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను క్షేత్రస్థాయి లో పరిశీలించాం. పరిహారం అందుకునేందుకు అర్హులైన రైతులను గుర్తించాం. ఈ మేరకు ప్రభుత్వానికి వివరాలు పం పించాం. ఇప్పుడు నిధులు విడుదలైన నేపథ్యంలో వారం, పది రోజుల్లోపే రైతుబంధు తరహారాలో పరిహారం రైతుల ఖాతాల్లో పడిపోతోంది. ఇందుకోసం రైతు లు ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి, నిర్మల్