ఖానాపూర్, ఏప్రిల్ 16 ః నూతనంగా స్వాతంత్య్రం పొం దిన దక్షిణ సూడాన్‌లో శాంతి రక్షణకు ఐక్యరాజ్య సమితి చేపట్టిన మిషన్‌కు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన మేజర్ సుతారి స్వామినాథ్ నేతృత్వం వహించారు. దక్షిణ సుడాన్లో ఇటీవల వరదలతో దెబ్బతిన్న రహదారులను పునర్నిర్మాణం చేయడంలో భారత సైన్యం, అధికారులు చేసిన కృషిని, మేజర్ స్వామినాథన్ మాట్లాడిన వీడియోను ఐరాస యూన్ఎంఐఎస్ఎస్ తన ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం తరపున శాంతిస్థాపన కోసం కృషి చేస్తున్న స్వామినాథ్ బృందం చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, అక్కడి పరిస్థితులను ఐక్యరాజ్య సమితి తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.