ఆదిలాబాద్, నవంబర్ 25(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలితీవ్రత పెరిగింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(యూ) మండలంలో రాష్ట్రంలోనే అతితక్కువ ఉష్ణోగ్రత 8.3 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 9.9 డిగ్రీలు, నిర్మల్లో 10.9 డిగ్రీలు, మంచిర్యాలలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో చలితీవ్రత అధికంగా ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన చలి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం అధికంగా ఉంటున్నది.