కాసిపేట, డిసెంబర్ 22 : కాసిపేట మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో సోమవారం సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యు లు బాధ్యతలు స్వీకరించారు. సర్పంచు.. ఉప సర్పంచు. వార్డు సభ్యులు అను మేము.. అంటూ ఆయా పంచాయతీల్లో అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవాలు చేశారు. స్పెషల్ ఆఫీసర్లు కాసిపేట, ముత్యంపల్లిలో శేఖ్ సప్ధర్ అలీ, పెద్దనపల్లి, సోమగూడెం(కే), లంబాడీతండా(కే)లో ఏవో చల్ల ప్రభాకర్, గట్రావ్ప ల్లి, దేవాపూర్‌లో ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, కోమటిచేను, పల్లంగూడలో తహసీల్దార్ సునీల్ కుమార్, మద్దిమాడలో సీనియ ర్ అసిస్టెంట్ ఆకుల లక్ష్మీనారాయణ, తాటిగూడ, ధర్మారావుపేట, మల్కెపల్లిలో పీఆర్ ఏఈ జగన్, రొట్టెపల్లి, వెంకటాపూర్, సోనాపూర్‌లో ఎంఈవో ముక్తవరం వెంకటేశ్వర స్వామి, మామిడిగూడెం, చిన్న ధర్మారంలో సూపరింటెండెంట్ లక్ష్మయ్య, బుగ్గగూడెంలో డీటీ అంజయ్య, కొండాపూర్, కోనూర్, లంబాడీతండా(డీ)లో ఇంట్రా ఏఈ సాయి అచ్యుత్ల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవాన్ని చేపట్టారు.
ఈ మేరకు సర్పంచులు కొండాపూర్‌లో ఒల్లెపు శైలజ రాజు, కోనూర్‌లో పేరం మల్లేశ్, పెద్దనపల్లిలో కల్వల శరత్ కుమార్, తాటిగూడలో మడావి వెంకటేశ్, కాసిపేటలో నీలా రాంచందర్, ఉప సర్పంచ్ బూరుగుపల్లి రమేశ్, పల్లంగూడలో దుస్స విజయ, ముత్యంపల్లిలో చాకటి సుగుణ, మద్దిమాడ ఆడె దివ్య జంగు, దేవాపూర్‌లో సిడం రాందాస్, గట్రావ్‌పల్లిలో ఆత్రం జంగు బాయి, కోమటిచేనులో జాడి మాణిక్య, లంబాడీతండా(కే)లో బోడ బలరాం, రొట్టెపల్లిలో ఆత్రం కళావతి, మల్కెపల్లిలో కోట్నాక రఘు, సోనాపూర్‌లో అర్క మహేందర్, ధర్మారావుపేటలో జగునాక రాధ, మామిడిగూడెంలో బానోత్ రాణి, లంబాడీతండా(డీ)లో బానోత్ సహస్ర, బుగ్గగూడెంలో నవనందుల పుష్పలత, వెంకటాపూర్‌లో పెంద్రం శంకర్, సోమగూడెం(కే)లో కున్సోత్ చైతన్య, చిన్న ధర్మారంలో భూక్య స్వప్నతో పాటు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మొదటి సమావేశం నిర్వహించారు. బాధ్యతలను స్వీకరించిన సర్పంచ్, వార్డు సభ్యులకు ఆయా గ్రామస్తులు, నాయకులు, అధికారులు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఎలాంటి ఘర్షనలు చోటు చేసుకోకుండా కాసిపేట, దేవాపూర్ ఎస్ఐలు ఆంజనేయులు, గంగారాం ఆధ్వర్యంలో పోలీస్ నిఘా చేపట్టారు.