ఆసిఫాబాద్, మార్చి 6 : మహిళల అభ్యున్నతితోనే దేశం ప్రగతి సాధిస్తుందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకలకు అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి భిక్షపతి, డీఆర్డీవో సురేందర్‌తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశ జీడీపీ అభివృద్ధిలో ప్రతిరోజూ మహిళలదే పై చేయి ఉంటుందన్నారు. సమాజ సేవలో మహిళలు ముందుండడం సంతోషంగా ఉందన్నారు.
మహిళలతోనే సృష్టి మనుగడ జరుగుతుందని, వివక్షత లేకుండా అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహించాలన్నారు. వారికి సముచిత స్థానం కల్పిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయి పదవుల్లో రాణిస్తారని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు జాతీయస్థాయి క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళా అధికారులు, ఉద్యోగులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలను సన్మానించారు. అనంతరం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా ఓటు హకును వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవోలు, అధికారులు, పాల్గొన్నారు.
‘పది’ ఫలితాల్లో ముందంజలో నిలపాలి
పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో నిలపాలని కలెక్టర్ వెంకటేశ్ దో త్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివా రీ, ఆర్డీవో లోకేశ్వర్ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌తో కలిసి పోలీసు, విద్యుత్, వైద్య, ఆరోగ్య, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులతో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో 37 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
6,595 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, 37 మంది వివిధ శాఖల అధికారులతో ఫ్లయింగ్ స్వాడ్, మొబైల్ స్వా డ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు సకాలంలో హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు ప్రణాళికాబద్ధంగా బస్సులు నడిపించాలని సూచించారు. అత్యవసర వైద్య సేవ ల కోసం ప్రాథమిక చికిత్స కిట్లతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు.
విద్యుత్ సరఫరాలో ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు తాగునీరు అం దుబాటులో ఉంచాలన్నారు. సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేయాలని, చీఫ్ ఇన్విజిలేటర్లు ఒక రోజు ముందుగానే ఇన్విజిలేటర్లకు తగు సూచనలు అందించాలన్నారు. నిరంతరం పర్యవేక్షిస్తూ ప్ర శాంత వాతావరణంలో పరీక్షలు సాగేలా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి గౌ డ్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి తుకారం భట్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
గ్రంథాలయ భవనం పూర్తవ్వాలి
జిల్లా గ్రంథాలయ శాఖ నూతన భవనాన్ని వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో రూ. 1.50 కోట్లతో నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీఈ. శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠకులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన పత్రికలు, పాఠ్యపుస్తకాలు, మెటీరియల్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, ఏఈ. కిరణ్, లైబ్రేరియన్ సదానందం, గుత్తేదార్ అమర్ బీన్ హైమద్, పాల్గొన్నారు.