మంచిర్యాల, జూలై 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గోదావరి పరీవాహక ప్రాంతమైన జైపూర్ మండలంలోని ఇందారం నుంచి అక్రమంగా ఇసుక రవా ణా చేస్తున్న మాఫియాపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందారంలో ఇసుక అక్రమార్కులు రె చ్చిపోతున్న తీరుపై నమస్తే తెలంగాణ ‘అక్రమంగా ఇసుక తవ్వుతాం.. అడ్డుకుంటే దాడు లు చేస్తాం’ అన్న శీర్షికన మంగళవారం కథనం ప్రచురించింది. ఇసుక అక్రమంగా తరలిస్తుంటే ఫొటోలు, వీడియో లు తీసిన కొందరు ఇందారం గ్రామస్తులపైకి ట్రాక్ట ర్ యజమానులు, డ్రైవర్లు, వర్కర్లు దాడికి వెళ్లిన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.

మంగళవారం ఉదయం నుంచి ‘నమస్తే’ కథనంతోపాటు ఆదివారం రాత్రి దాడికి వెళ్లిన వీడియోలు వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించారు. ఇందారంతోపాటు గోదావరి చుట్టు పక్కల గ్రామాల్లో మంగళవారం తనిఖీలు నిర్వహించి అక్రమంగా నిలువ చేసిన ఇసుక డంప్‌లను గుర్తించారు. ఇసుక మాఫియా నడిపిస్తు న్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసులు నమో దు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జై పూర్ ఏసీపీ వెంకటేశ్వర్ మంగళవారం సాయం త్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఇందారం గోదావరి నుంచి ఇసుక తీసుకెళ్లే మాఫి యా గోదావరి ఒడ్డున డంప్‌లు ఏర్పాటు చేసుకుని టిప్పర్ల ద్వారా తరలిస్తున్నట్లు మాకు సమాచారం వచ్చిందన్నారు. రెండు రోజుల క్రితం మా ఎస్ఐ శ్రీధర్ దాదాపు 50 ట్రిప్పుల ఇసుక డంప్‌లను ప ట్టుకున్నారని, ఈ రోజు తనిఖీలు నిర్వహించి మరో 30 ట్రిప్పుల ఇసుక పట్టుకున్నామని చెప్పారు. ఇసుకను సీజ్ చేసి బాధ్యులైన వ్యక్తులపై సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశామన్నారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిన వ్యక్తుల ఇండ్లపైకి దాడికి వెళ్లిన మహమ్మద్ జైనుద్దీన్, గుండా శ్రీనివాస్, బద్దె ల సాయికృష్ణ, పల్లా రాజ్‌కుమార్, జక్కుల రాహు ల్, బూకల స్వామి, వైద్య శేఖర్, పెద్దపల్లి సంపత్, నల్లీ దీపులపై ఐపీసీ సెక్షన్ 329(4), 351(ఆర్డబ్ల్యూ) కింద కేసులు నమోదు చేశామన్నారు.
ఈ తొమ్మిది మందికి నోటీసులు ఇచ్చి తహసీల్దార్ ఎ దుట రూ.5 లక్షల పూచీకత్తుతో బైండోవర్ చేశామన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే అందరిపైనా కేసులు నమోదు చేస్తామన్నారు. పట్టుబడే ట్రాక్టర్లను సీజ్ చేయడంతోపాటు ట్రాక్టర్ యాజమానులు, డ్రైవర్లపై సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తామన్నారు. ఎవరైనా సరే లీ డర్ల పేర్లు, పోలీసుల పేర్లు చెప్పి ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హె చ్చరించారు. ఇసుక కావాల్సిన వాళ్లు ప్రభుత్వ రీచ్ ల నుంచి మాత్రమే తీసుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ శ్రీధర్ పాల్గొన్నారు.
ఇందారం ఇసుక తరలింపు అంశంలో తనపై వస్తున్న ఆరోపణలు సరికాదని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఫయాజ్ తెలిపారు. ఇసుక ట్రాక్టర్లకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నేనంటే గిట్టని వారు నాకు ట్రాక్టర్లు ఉన్నాయంటూ నాపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణాలో కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా ఉంటే ఎమ్మెల్యే వివేక్ దృష్టికి తీసుకెళ్లి కచ్చితంగా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.