వాంకిడి : బాలల సంరక్షణ బాధ్యత తమదేనని జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్గ మహేష్ (Mahesh) అన్నారు. గురువా రం కొమురం భీం జిల్లా వాంకిడి (Wankidi ) మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎలాంటి సమస్యలు ఉన్న 1098 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. పదో తరగతి(Tenth Exams) వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళిక బద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చంద్రశేఖర్, చైల్డ్ హెల్ప్ లైన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ బాల ప్రవీణ్, కేస్ వర్కర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.