ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతిని ( Bhu Bharati ) పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ( Collector Rajarshi Shah ) సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం బోరజ్ మండలంలో భూభారతి సదస్సును పరిశీలించారు. మండలంలోని తర్నం, పెండల్ వాడ గ్రామాల్లో సదస్సులను సందర్శించి అధికారులతో మాట్లాడారు.
రైతుల భూముల సమస్యలను పరిష్కరించడానికి కోసం ప్రభుత్వం భూభారతిని అమలు చేస్తుందని, రైతుల వద్ద నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. అధికారులు, సిబ్బంది రైతులకు సలహాలు సూచనలు అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట మండల అధికారులు ఉన్నారు.