దండేపల్లి, అక్టోబర్ 5 : ‘అటవీ అధికారులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నరు. ఇక సహించేది లేదని’ అంటూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్తమామిడిపెల్లి జీపీ పరిధిలోని దమ్మన్నపేట గూడేనికి చెందిన ఆదివాసీ నాయక్‌పోడ్ గిరిజనులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం తాళ్లపేట అటవీ రేంజ్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ కొంతకాలంగా లింగాపూర్ బీట్‌లోని అటవీ భూము ల్లో పోడు సాగు చేసుకుంటున్నామని, అటవీ అధికారులు అకారణంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ తమ పూర్వీకులపై కేసులు నమోదు చేశారని, వారు చనిపోయినా వారిపైన ఉన్న కేసులు ఇతరుల పేర్లపై బదలాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
అటవీ భూముల విషయంలో సంబంధం లేని వాళ్లపైన కూడా కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. కొత్తగా పళ్లైన అమ్మాయిలు, గర్భవతులు అని కూడా చూడకుండా కేసులు నమోదు చేసి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వానికి, అధికారులకు సహకరిస్తున్నా ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. ఒక్కొక్కరిపై 5 కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆదివాసీ సంఘ నాయకులైన బాపుపై 8 కేసులు, అర్జున్‌పై 9 కేసులు పెట్ట డం దారుణమని వాపోయారు.
అక్రమ కేసు లు నమోదు చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించగా, అధికారులు-ఆదివాసీ నాయకుల మధ్య కొంత సేపు వాగ్వా దం జరిగింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ రేంజ్ అధికారి సాగరిక, ఎఫ్ఎస్వో, ఎఫ్‌బీవో, బ్బందితో అక్కడికి చేరుకొని సంఘ నాయకులతో మా ట్లాడి, విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తానన్నారు. తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు తట్ర అర్జున్, నాయక్‌పోడ్ సేవా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సాదం బాపు, నాయకులు శంకర్, విష్ణు, ఆరె దుబ్బరాజం, కల్లెడ బాలు, మొడితె మహేశ్, జేనేని రాజేందర్ ఉన్నారు.