నార్నూర్, జనవరి 6 : నాగోబా మహాపూజ(జనవరి21)కు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణ కోసం ప్రారంభమైన మెస్రం వంశీయుల పాదయాత్ర శుక్రవారం రాత్రి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేడిజాల గ్రామానికి చేరుకున్నది. అంతకుముందు గాదిగూడ మండలం సాంగ్వీ పంచాయతీ పరిధిలోని గణేశ్‌పూర్‌లో గురువారం రాత్రి బస చేశారు. మెస్రం వంశీయులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఝరికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించారు. అనంతరం గణేశ్‌పూర్ నుంచి ఉదయం కాలినడకన నార్నూర్ మండలం మాన్కాపూర్ చేరుకోగా, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. మెస్రం వంశీయులు, గ్రామపెద్దలు, మహిళలు ఝరికి పూజలు చేశారు. సహపంక్తి భోజనాలు చేశారు.
గాదిగూడ మండలం బొడ్డిగూడ, గణేశ్‌పూర్ గ్రామాల్లో బస చేశామని, శుక్రవారం సాయంత్రం లేడిజాలకు చేరుకొని బస చేస్తామని మెస్రం పెద్దలు తెలిపారు. శనివారం జైనూర్‌లో బస ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాదిప్రధాన్ మెస్రం దాదారావు, ఖాటి కటోడ మెస్రం కోసు, కటోడ మెస్రం శేకు, ఝడ్యా మెస్రం భొజ్జు, గాయికి మెస్రం దేవ్‌రావ్, నాయిక్‌వాడి మెస్రం ధర్ము, సంక్కేపల్లి మెస్రం శాందుర్రావ్, వాడి మెస్రం జంగు, జోప్పా మెస్రం శేకు, ప్రధాన్ నాగోబా పెన్ కోత్త్వల్ మెస్రం తిరుపతి, గ్రామపెద్దలు మెస్రం రూప్‌దేవ్, మెస్రం యాదవ్రావ్, మెస్రం మోతీరామ్, మెస్రం బాదిరావ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావ్, భీంరావ్, ఏత్మారామ్, రూప్‌దేవ్, చందుర్శావ్ ఉన్నారు.