తాంసి, మే 23 : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో నల్లమట్టిని అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మత్తడి వాగు ప్రాజెక్ట్ పరిధిలో రైతులు పొలాలకు వినియోగించాల్సిన నల్లమట్టిని అధికారుల అనుమతుల పేరిట తరలించి, రైతులకు కాకుం డా బడా వ్యాపారుల చేతుల్లోకి వెళ్లేలా చేసి ఇటుకల తయారీకి వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా హస్నాపూ ర్ శివారులో సుమారు 22 గుంటల విస్తీర్ణంలో దాదాపు 300ల టిప్ప ర్ల నల్లమట్టిని డంప్ చేసినప్పటికీ అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటుకల తయారీ కోసం పెద్ద ఎత్తున నల్లమట్టిని తరలించడం వల్ల వ్యవసాయ భూముల సారంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు అక్రమంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై పర్యవేక్షణ లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తాంసి తహసీల్దార్‌ను వివరణ కోరగా.. అక్రమ నల్లమట్టి డంప్ తన దృష్టికి రాలేదని విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.