అసెంబ్లీ సాక్షిగా శుక్రవారం గిరిజనులపై వరాల జల్లు కురిసింది. నెలాఖరులోగా పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన అడవిబిడ్డల్లో ఆనందం నింపింది. ఏండ్లుగా ఉన్న డిమాండ్‌ను నెరవేర్చి తీరుతామని స్పష్టం చేయడంపై గిరిజనం మురిసిపోతున్నది. ఉమ్మడి జిల్లాలో 66,004 మంది రైతులకు లబ్ధి చేకూరనుండగా, సంబురపడుతున్నది. కాగా, మరోవైపు దళితబంధు తరహాలోనే గిరిజన బంధు అమలు చేస్తామని ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– ఆదిలాబాద్, ఫిబ్రవరి10(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, ఫిబ్రవరి 10 ( నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీ భూముల్లో వ్యవసాయం చేస్తున్న రైతులకు త్వరలో పట్టాలు అందనున్నాయి. ఈ మే రకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పోడు భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారం, గిరిజన రైతులకు మేలు కలిగే విధంగా ప్రకటన చేయడంపై హర్షం వ్యక్తమవుతున్నది. ఎన్నో ఏళ్లుగా అటవీ భూములను సాగు చేస్తున్న గిరిజన, ఇతర రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లా వ్యాప్తంగా పోడు వ్యవసాయం చేస్తు న్న గిరిజనులు, ఇతర రైతుల వద్ద నుంచి గతేడాది నవంబరులో దరఖాస్తులు తీసుకున్నా రు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 38 మం డలాలు.. 248 పంచాయతీల్లోని 711 గ్రా మాల్లో పోడు భూములను గిరిజనులు, ఇతర రైతులు సాగు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 66,004 మంది రైతులు పోడు భూముల్లో పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు జిల్లాల్లో 2, 27,129 ఎకరాల అటవీ భూములను సాగు చేస్తున్నట్లు దరఖాస్తుదారులు సూచించారు.
ఉమ్మడి జిల్లాలో 33,885 మంది గిరిజన రైతులు 1,24,522 ఎకరాలు, 32,119 ఇత ర రైతులు 1,02,507 ఎకరాలకు గానూ హ క్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 11,172 మంది గిరిజనులు 44,120 ఎకరాలకు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 13,177 మంది గిరిజన రైతులు 51,859 ఎకరాలకు, నిర్మల్ జిల్లాలో 5076 మంది రైతులు 14,955 ఎకరాలకు, మంచిర్యాల జిల్లాలో 4,460 మంది రైతులు 13,587 ఎకరాల కోసం దరఖాస్తులు అందజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 7,172 మంది ఇతర రైతులు 28,472 ఎకరాలకు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 13,503 మంది రైతులు 44,267 ఎకరాల కోసం, నిర్మల్ జిల్లాలో 3590 మంది 10,037 ఎకరాలకు, మంచిర్యాల జిల్లాలో 7314 మంది రైతులు 19,830 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గిరిజన, ఇతర రైతుల దరఖాస్తులను అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు.

గిరిజన బంధు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మారుమూల గ్రామాల్లో నివసించే వారికి ప్రభుత్వం ఉట్నూరు ఐటీడీఏ ద్వారా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. దళితబంధు పథకం ద్వారా దళితుల ఉపాధి ఎంతో మెరుగుపడింది. సర్కారు అందించిన సాయంతో వారు వివిధ యూనిట్లను ప్రారంభించి ఆదాయం గడిస్తున్నారు. దళితబంధు తరహాలో గిరిజనుల ఉపాధిని కూడా మెరుగుపర్చడానికి గిరిజనబంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గిరిజనులకు అండగా బీఆర్ఎస్..
బీఆర్ఎస్ ప్రభు త్వం గిరిజనులకు అండగా నిలుస్తున్నది. 10 శాతం రిజర్వేషన్లు అమలు చే స్తుండడంతో గిరిజనులకు విద్య, ఉద్యోగావకాశాలు మెరుగుపడుతాయి. గత ప్రభుత్వా లు గిరిజనుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా ఆదివాసీ గ్రామాల ప్రజలు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం కేసీఆర్ పట్టాల పంపిణీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గిరిజనబంధు అమలు చేస్తే గిరిజనుల అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు.
– కుమ్ర సుధాకర్, జడ్పీటీసీ, భీంపూర్
గత పాలకులు పట్టించుకోలేదు..
ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. గత పాలకులు గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతున్నారు. గిరిజనులకు పట్టాల పంపిణీతో ప్రయోజనం చేకూరనున్నది. గిరిజన బంధు పథకం వల్ల మేలు జరుగుతది.
– మర్సుకోల తిరుపతి, గిరిజన సంఘాల నాయకుడు