బెల్లంపల్లిరూరల్, ఫిబ్రవరి 11: తెలంగాణ సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ ప్రభుత్వ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికిగాను ఐదో తరగతిలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ప్రవేశపరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఆదిలాబాద్ రీజియన్‌లోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 8844 మంది విద్యార్థులకుగాను 8422 మంది హాజరయ్యారని ఆర్సీవో కే.స్వరూపారాణి తెలిపారు. బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన నాలుగు పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. బెల్లంపల్లిలోని పరీక్షా కేంద్రాలను గురుకులాల అసిస్టెంట్ సెక్రటరీ వెంకటేశం పరిశీలించారు. బెల్లంపల్లి సీవోఈని రూరల్ సీఐ అఫ్జలొద్దీన్ సందర్శించారు.
నాలుగు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. సీవోఈ కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌గా ఐనాల సైదులు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్‌గా నస్పూరి నవ్యకుమారి, సిట్టింగ్ స్కాడ్‌గా ఆడెపు సాగర్లు వ్యవహరించారు. బెల్లంపల్లి బాలుర గురుకుల సంక్షేమ కళాశాలలో 480 మందికిగాను 455, బెల్లంపల్లి బాలికల గురుకుల సంక్షేమ కళాశాలలో480 మందికిగాను 456, కాసిపేట బాలుర గురుకుల కళాశాలలో 240 మందికిగాను 266, బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర గురుకుల కళాశాలలో 288 మందికిగాను 270 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. రూట్ ఆఫీసర్లుగా యల్ల ఆనందరెడ్డి (ఆదిలాబాద్), గద్దె రాజ్‌కుమార్ (ఆసిఫాబాద్) కోటిచింతల మహేశ్వర్రావ్ (మంచిర్యాల) వ్యవహరించారు.