కౌటాల, ఫిబ్రవరి 21: మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ హెల్త్ మిషన్లో చోటు దక్కింది. తా జాగా జాతీయ హెల్త్ మిషన్ విడుదల చేసిన ఉత్తమ పీహెచ్సీల్లో కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో స్థానం లభించింది. గతేడాది డిసెంబర్ 28, 29 తేదీల్లో కేంద్ర వైద్య క్వాలిటీ, అస్యూరెన్స్ బృందం వారు పీహెచ్సీని తనిఖీ చేశారు. ప్రతి విభాగాన్ని, ప్రతి సేవను, పరిశుభ్రత, స్వచ్ఛత, తాగునీరు, మరుగుదొడ్లు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, ప్ర సవాలు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్ కిట్, బాలింతలకు అందిస్తున్న పోషకాహార కిట్ తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేసుకున్నారు. కౌటాల పీహెచ్సీలో జాతీయ హెల్త్ మిషన్ కార్యక్రమాలు అమలు, సేవల్లో నాణ్యతా ప్రమాణాలు మెరుగ్గా ఉండడంతో రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో స్థానంతో పాటు 83.6 శాతంతో క్వాలిటీ సర్టిఫికెట్ దక్కింది. అలాగే నిర్మల్ జిల్లా ముజ్గి పీహెచ్సీకి కూడా చోటు దక్కింది.