ఎదులాపురం, ఏప్రిల్ 5 : బాబూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధన దిశగా ప్రతి ఒకరి ఆలోచనలో మార్పు రావాలని, ఆయన ఆశయ సిద్ధాంతాలు ప్రేరణగా తీసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం బాబూ జగ్జీవన్‌రామ్ చౌక్‌లో జగ్జీవన్‌రామ్ 118వ జయంతిని నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షుడు అజయ్, నారాయణ, మెట్టు ప్రహ్లాద్, వేణుగోపాల్ యాదవ్, బట్టు సతీశ్, భోజన్న, మద్దుల ఉషన్న, గంగన్న, సంతోష్‌రెడ్డి, ముకెర ప్రభాకర్ పాల్గొన్నారు.
నేరడిగొండ, ఏప్రిల్ 5 : స్వాతంత్య్రం, సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత బాబూ జగ్జీవన్‌రామ్ అని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కొనియాడారు. శనివారం మండల కేంద్రంలో ఆయన జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శివారెడ్డి, మాజీ జడ్పీటీసీ సయ్యద్ జహీర్, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ వైస్ ఎంపీపీ మహేందర్‌రెడ్డి, వీడీసీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ దేవేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు జాదవ్ రమేశ్, సవాయిరాం, నాయకులు అంబేకర్ పండరి, గులాబ్‌సింగ్, రుక్మణ్‌సింగ్, ప్రతాప్‌సింగ్, లింబాజీ, రాథోడ్ సురేందర్, కమలాకర్, శేఖర్, రాథోడ్ రాజశేఖర్, లవకుమార్‌రెడ్డి, మధన్‌సింగ్ పాల్గొన్నారు.