ముగిసిన తొలి విడుత.. ఎప్‌సెట్ కౌన్సెలింగ్
ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్‌సెట్ తొలి విడుత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్‌గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో నాలు గు రోజులపాటు నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలన గురువారంతో పూర్తయింది.
- 524 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి
ఎదులాపురం, జూన్ 25 : ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్‌సెట్ తొలి విడుత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్‌గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో నాలు గు రోజులపాటు నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలన గురువారంతో పూర్తయింది. ఈ ప్రక్రియను కళాశాల ప్రిన్సిపాల్, కో-ఆర్డినేటర్ డి.నరేష్ ప్రారంభించి పర్యవేక్షించారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేస్తూ కౌన్సెలింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. మొదటి రోజు 202 మంది, రెండో రోజు 110 మంది, మూడో రోజు 106 మం ది అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోగా, చివరి రోజు 117 మంది స్లాట్ బుక్ చేసుకున్నారు.
వారిలో 106 మంది హాజరై తమ ధ్రువపత్రాలను పరిశీలింపజేసుకున్నారు. మొత్తం నాలుగు రోజుల వ్యవధిలో 524 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందని కోఆర్డినేటర్ డి.నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు జూన్ 25 నుంచి జూలై 1 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నారు. తొలి విడుత సీట్ల కేటాయింపు జూలై 10న ప్రకటించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు గడువులోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకొని ఇంజినీరింగ్ ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

