భైంసా టౌన్, అక్టోబర్ 18 : భైంసా మండలంలోని దేగాం గ్రామంలో భైంసా-బోధన్ జాతీయ రహదారి నిర్మాణ పనులు మూడేళ్లుగా కొనసాగుతున్నాయి. ఇటీవల ఏకధాటిగా కురిసిన వర్షాలతో అసంపూర్తిగా నిర్మించిన డ్రెయినేజీ ఉప్పొంగి ప్రవహించడంతో ఇంటి ఎదుట ఆరబెట్టుకున్న సోయా నీళ్లపాలైంది. రోడ్డుకు సమీపంలో ఉన్న పలువురు కుటుంబీకు లు తమ ఇళ్ల ఎదుట సోయా పంటను ఆరబెట్టుకున్నారు. అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన డ్రెయినేజీలోని నీరంతా అరబెట్టిన పంటలోకి చేరడంతో పాడైంది. కాంట్రాక్టరుకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండడంతో తాము పంటను అంతా నష్టపోయామన్నారు.
ఈ విషయమై రెవెన్యూ, పోలీసులు, వ్యవసాయ శాఖకు ఫిర్యాదు చేశామన్నారు. శనివారం కాలువ నిర్మాణ పనులు పరిశీలించేందుకు వచ్చిన ప్రాజెక్టు మేనేజర్ అమిత్ మిశ్ర ఎదుట తమ గోడును వెల్లబోసుకున్నారు. నష్టపరిహారం అందించాలని కోరగా.. మేము ఎలాంటి పరిహారమందించమనడంతో రైతులు ఆం దోళన చెందారు. తమకు ఆత్మహత్యే శరణ్యమనంటూ పురు గు మందు డబ్బాలు పట్టుకొని కాలువ వద్ద నిరసన తెలిపా రు. అధికారులు స్పందించి గుత్తేదారులతో నష్టపరిహారం ఇప్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయమై సంబంధిత ఎన్హెచ్ ఏఈఈ నరేశ్కుమార్ను వివరణ కోర గా నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేస్తున్నామన్నారు.
కాంట్రాక్టరు నిర్లక్ష్యంతో పంటను పూర్తిగా నష్టపోయాం. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేం దుకు ఇంటి ఎదుట ఆరబెట్టాం. 40 క్వింటాళ్ల మేర సోయా దిగుబడి మురికి కాలువలో కొట్టుకుపోయింది. దీంతో ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు ఎలా కట్టాలి. అధికారులు స్పందించి కాంట్రాక్టరుతో మాట్లాడి పంట నష్టపరిహారం అందించాలి.
– శీల, రైతు, దేగాం.
ఆరుగాలం కష్టించి పండించిన సోయా పంటను పూర్తిగా నష్టపోయాం. 20 క్వింటాళ్ల దిగుబడి రావడంతో తమ ఇంటి ఆవరణలో ఆరబెట్టా. అకాల వర్షంతో అసంపూర్తి నిర్మాణ పనుల్లో భాగంగా కాలువ నుంచి నీరు వచ్చి పంటంతా కొట్టుకుపోయింది. కాంట్రాక్టరు నిర్లక్ష్యంతో పంటను విక్రయించే సమయంలో ఇబ్బందులు పడుతున్నాం. నష్ట పరిహారం అందించాలి. లేదంటే ఆత్మహత్యే శరణ్యం.
– ఉమ, రైతు, దేగాం.