నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలంలో బీఆర్ఎస్ ( BRS ) ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ సమైక్యతా దినోత్సవాన్ని ( Telangana Unity Day ) ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు, పార్టీ భవనాలలో జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ కార్యక్రమంలో నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ మాజీ చైర్మన్ తోడసం నాగోరావ్, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు ఉర్వేత రూప్ దేవ్, పట్టణ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్, మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాసిం, మాజీ సర్పంచ్ మాడవి ముక్తా రూప్ దేవ్, మాజీ ఎంపీటీసీ రాథోడ్ రమేష్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాథోడ్ సుభాష్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సుల్తాన్ ఖాన్, రాజు, అబ్బు, దయానంద్ తదితరులున్నారు.