ఈనెల 25వ తేదీన నిర్మల్ జిల్లాలో ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో మంగళవారం సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామ శివారులో నిర్మించే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మించే స్థలాన్ని కలెక్టర్ వరుణ్‌రెడ్డి పరిశీలించారు. ఫ్యాక్టరీ పనులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి కేటీఆర్ భూమిపూజ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సభాస్థలి, రోడ్డు, ఇతర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
– సోన్, సెప్టెంబర్ 19
దిలావర్పూర్, సెప్టెంబర్ 19: కాళేశ్వరం ప్యా కేజీ 27 పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఐటీ శా ఖ మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవానికి వస్తున్న నే పథ్యంలో గుండంపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో ఉన్న పంపుహౌస్ వద్ద ఏర్పాట్లపై ఇరిగేషన్, జిల్లా విద్యుత్‌శాఖ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. అక్కడి నుంచి దిలావర్పూర్ సమీపంలో ఉన్న రెండో పంపును పరిశీలించి అక్కడే రైతులతో మాట్లాడేందుకు కావాల్సిన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గుండంపల్లి గ్రామంలో పంపుహౌస్ పనులు ప్రారంభించిన అనంతరం సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామంలో ఆయిల్‌పామ్ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కాళేశ్వరం ప్యాకేజీ 27 పనులు ఎక్కడైనా చిన్న చిన్న పనులు మిగిలి ఉంటే వాటిని పూర్తి చేయాలని ఆదేశించా రు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. నీటిపారుదలశాఖ ఈఈ రామారావు, విద్యుత్ శా ఖ ఎస్ఈ చౌహాన్, అధికారులు ఉన్నారు.
ఐసీటీసీ కేంద్రం తనిఖీ
నిర్మల్ చైన్‌గేట్, సెప్టెంబర్,19: నిర్మల్ పట్టణంలో ని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని ఐసీటీసీ కేం ద్రాన్ని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జిల్లా బా ధ్యుడు జైసేతుమాధవ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రికార్డులు తనిఖీ చే శారు. హెచ్ఐవీ కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి అవగాహన పెంచాలన్నారు. పరీక్ష లు రెట్టింపు చేయాలని కోరారు. ఐసీటీసీ కౌన్సి ల ర్లు సుదర్శన్, రాంచందర్, శ్రీనివాస్, ల్యాబ్ టెక్నీషియన్ రమేశ్‌రెడ్డి, సాజిద్ తదితరులున్నారు.