నస్పూర్, ఏప్రిల్ 2 : బానిస ప్రజల విముక్తి, బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మం చిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ హాజరై పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాపన్న గౌడ్ పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. మహనీయుల వర్ధం తి, జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతీలాల్, అధికారులు పురుషోత్తం, వెంకటేశ్వర్రావు, రవీందర్‌రెడ్డి, రాజేశ్వరి, కల్పన, దుర్గా ప్రసాద్, సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఏప్రిల్ 2: బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం ఆసిఫాబాద్‌లోని కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డెవిడ్, అధికారులు, గౌడ సంఘం నాయకులు, వెనుకబడిన తరగతుల కులాల సంఘాల నాయకులతో హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి పాపాన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మొగలాయిల దౌర్జన్యాలు, జమీందారుల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడని కలెక్టర్ కొనియడారు. ఆయనను భావి తరాలు స్ఫూర్తిగా తీసుకునేలా ఆయన చరిత్రను చాటిచెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సజీవన్, డీపీవో భిక్షపతి గౌడ్, గౌడ సంఘం నాయకులు బాలేశ్ గౌడ్, సుదర్శన్ గౌడ్, మహిళా సంఘ అధ్యక్షురాలు అన్నపూర్ణ, వెనుకబడిన తరగతుల కులాల ప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.