కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ( Telangana Model School ) కు చెందిన 8వ తరగతి విద్యార్థి జక్కుల అశ్విన్ రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ ( Ball Badminton ) పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 44వ సబ్ జూనియర్ బాల, బాలికల బాల్‌బాడ్మింటన్ అండర్-14 విభాగం పోటీలు ఆదివారంసింగరేణి హైస్కూల్ గోలేటీలో నిర్వహించారు. ఈ పోటీలో జక్కుల అశ్విన్ ప్రతిభను కనబరిచి జనగామ జిల్లా కూనూర్‌లో జరుగనున్న రాష్ట్ర స్థాయి బాల్ బాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యాడని తెలిపారు.
ఈ సందర్భంగా జక్కుల అశ్విన్‌ను ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ గౌడ్, పాఠశాల సిబ్బంది అభినందించారు. అదేవిధంగా ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కుంగ్ ఫూ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి 2వ ఓపెన్ కుంగ్‌ఫూ, కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన యం. అశ్విత, పి.నేహ, ఆర్.మనస్విని, రజత పతకం సాధించిన బి. సింధు, ఎస్ కీర్తన, బి.అక్షర, బి హన్షిత, కే లౌక్యశ్రీలను, కరాటే మాస్టర్ కే.రవిని, ప్రిన్సిపాల్, పీడి శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు.