మంచిర్యాల, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు ప లువురు ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతుదారులు పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్ ఏర్పాటు చేసుకుని ఓటర్లకు పోలింగ్ స్లిప్పులు అందజేసి సహకరించారు. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 1,9 66 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా 1,6 01 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి 81.43 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే జి ల్లాలో 17,141 మంది గ్రాడ్యుయేట్లు ఉండ గా, వీరిలో 11,374 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టభద్రుల పోలింగ్ శాతం 66.36గా నమోదైంది. ఉపాధ్యాయ ఓ టర్ల కోసం 19, గ్రాడ్యుయేట్ల కోసం 27 పో లింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశా రు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మం ది, పట్టభద్రుల స్థానానికి 56 మంది పోటీ ప డ్డారు. ఎవరు మెజారిటీ ఓట్లను దక్కించుకుని విజేతలుగా నిలుస్తారో మార్చి 3వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపులో తేలనున్నది.
నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అప్పటికే క్యూలో ఉన్నవారిని ఓటింగ్‌కు అనుమతించారు. సాయంత్రం 5 గంటల వరకు దాదాపుగా అన్ని కేంద్రాల్లో పోలింగ్ ముగియగా, ఒక్క సారంగాపూర్ పోలింగ్ కేంద్రంలో మాత్రం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. జిల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాల ఇంజినీరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కూడా పరిశీలించారు. లోకేశ్వరం మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 68వ నంబరు పోలింగ్ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) కిశోర్ కుమార్ తనిఖీ చేశారు. అలాగే స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో 1,593 మంది ఉపాధ్యాయ ఓటర్లు, 14,935 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. ఉదయం 10 గంటల వరకు ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ 16.47 శాతం నమోదు కాగా, పట్టభద్రుల పోలింగ్ 7.84 శాతం, మధ్యాహ్నం 12 గంటల వరకు ఉపాధ్యాయుల పోలింగ్ శాతం 43.25, పట్టభద్రుల పోలింగ్ శాతం 23.02, మధ్యాహ్నం 2 గంటల వరకు ఉపాధ్యాయుల పోలింగ్ శాతం 75.33, పట్టభద్రుల పోలింగ్ శాతం 44.09 నమోదు అయింది. కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్ పట్టణంతోపాటు ఇంద్రవెల్లి, గుడిహత్నూర్ మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు.
మంచిర్యాల జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు 1664 మంది ఉంటే, 1474 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 88.58 శాతం పోలింగ్ నమోదైంది. ఇక పట్టుభద్రుల ఓటర్లు 30,921 ఉండగా , 18,701 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 60.48శాతం పోలింగ్ నమోదైంది. అలాగే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు 470 మంది ఉండగా, 424 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 90.21 శాతం పోలింగ్ నమోదైంది. ఇక పట్టుభద్రుల ఓటర్లు 6137 మంది ఉండగా , 4546 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 74.08 శాతం పోలింగ్ నమోదైంది.