జైపూర్, డిసెంబర్ 27 : టేకుమట్ల గ్రామంలోని బాలాజీ రైస్‌మిల్లు, ముదిగుంట గ్రా మంలోని బీఎస్‌వై రా రైస్‌మిల్లును శుక్రవా రం రాష్ట్ర సివిల్ సైప్లె టాస్క్ఫోర్సు ఓఎస్డీ శ్రీధర్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి తనిఖీ చేశా రు. ఆయన మాట్లాడుతూ బాలాజీ రైస్‌మిల్ నిర్వాహకులు 2023-24 ఖరీఫ్ సీజన్లో 2305 మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయిలు చెలించాల్సి ఉందని, దీని విలువ రూ. 5.5 కోట్లు ఉంటుందన్నారు.
ముదిగుంటలోని బీఎస్‌వై రా రైస్‌మిల్ 2022-23 రబీ సీజన్లో 3858 మెట్రిక్ టన్నులు కాగా, 2023-24 ఖరీఫ్‌కు సంబంధించి 2687 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వానికి బకాయి చెల్లించాల్సి ఉందన్నారు. వీటి విలువ సుమారు రూ. 19 కోట్లుగా నిర్ధిరించినట్లు తెలిపారు. ఇద్దరు రైస్‌మిల్లుల నిర్వాహకులతో చెల్లింపులకు సంబందించి అంగీకారపత్రం రాయించుకున్నట్లు చెప్పారు. ఈ నెల 31లోగా బకాయిలు చెల్లించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ సివిల్ సైప్లె అధికారి వేణుగోపాల్, సివిల్ సైప్లె డిప్యూటీ తహసీల్దార్ స్రవంతి, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.