తాండూర్ : తాండూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ దేవయ్య, సబ్ ఇన్‌స్పె్క్టర్ కిరణ్‌కుమార్ ప్రశంసాపత్రాలు అందుకున్నారు. సీఐ దేవయ్య ఉత్తమ ఉద్యోగి అవార్డును జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌రావు, కలెక్టర్ కుమార్ దీపక్, డీసీ భాస్కర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కుమార్ చేతుల మీదుగా ఎస్సై డి కిరణ్ కుమార్ ( SI Kiran kumar ) ఉత్తమ సేవ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని నర్సాపూర్ వద్ద నిండుగా పారుతున్న వాగులో నిండు గర్భిణి వాగులో చిక్కుకుంది. పోలీసులు, గజ ఇతగాళ్లు, నాయకుల సాయంతో పాటు ఎస్సై స్వయంగా వాగులోకి దిగి తాళ్లు ఏర్పాటు చేసి నిండు గర్భిణీని సురక్షితంగా రక్షించి ఆసుపత్రిలో చేర్పించి సుఖ ప్రసవం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు.
అతడి ధైర్యసాహసాలను గుర్తించిన అధికారులు స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రశంస పత్రాన్ని అందజేసి అభినందించారు. పోలీస్ శాఖ వారి తరఫున బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య, తోటి సిబ్బంది , నాయకులు, అభినందనలు తెలిపారు.