సోన్, మే 1: ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వేసవి క్రీడా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ మండలం ముజ్గి ప్రభుత్వ పాఠశాలలో వేసవి క్రీడా శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పిల్లలు, యువతకు ఈ శిబిరాలు ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. నెల రోజుల పాటు నిర్వహించే శిబిరాల్లో అథ్లెటిక్స్‌తో పాటు ఇతర క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు క్రీడలు, 9 నుంచి 10 గంటల వరకు విద్యాశాఖ అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. 6 నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు ఈ శిబిరాల్లో పాల్గొనవచ్చని వెల్లడించారు. వీరి కోసం తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో డీఈవో రవీందర్‌రెడ్డి, ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి నర్సింహారెడ్డి, సర్పంచ్ పొలాస రాజమణి మల్లేశ్, ఎంపీటీసీ సంతోష్, ఎంపీడీవో సాయిరాం, ఎంపీవో సురేశ్, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సోన్ మండలం న్యూవెల్మల్ బొప్పారం ఉన్నత పాఠశాలలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు అంకం గంగామణిశ్రీనివాస్, వెంకయిగారి హరితశ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో ఉషారాణి, ఎంపీవో కలీం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శిక్షణ శిబిరాలు ప్రారంభం
నర్సాపూర్(జీ), మే 1: వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో టేబుల్ టెన్నీస్, వాలీబాల్,క్యారమ్స్ ఆడి వారిని ఉత్సాహ పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. సెలవుల్లో సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని, ఆటలకు దగ్గర కావాలని సూచించారు. క్రీడలతో శారీరక, మానసిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. వందన సమర్పణ చేసిన ఎన్సీసీ కేడెట్లను అభినందించారు. మండలంలోని గొల్లమాడ, అంజని తండా పాఠశాలలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు దర్శనం దేవేందర్ తెలిపారు. ఐదు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు.
కంటి వెలుగు శిబిరం పరిశీలన
నర్సాపూర్ (జీ) ప్రభుత్వ పాఠశాలలోని కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించి రోగులతో మాట్లాడారు. పరీక్షలు బాగా చేస్తున్నారా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీఈవో రవీందర్ రెడ్డి, డీవోఎస్ క్రాంతికుమార్, డీఏవో అంజిప్రసాద్, ఎంపీడీవో అల్లాడి వనజ,ఎంపీవో శ్రీనివాస్ గౌడ్, ఏపీవో సుగుణ, సర్పంచ్ రాంరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కోండ్ర రమేశ్, ఎంపీటీసీ మల్లేశ్, ఎస్ఎంసీ చైర్మన్ నారాయణ, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, బర్కుంట గంగారాం, బర్కుంట రమేశ్, కిషణ్రావు, మోహన్ రావు, సదానందం పాల్గొన్నారు.