కడెం, అక్టోబర్ 14 : కన్నాపూర్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. చిన్న పంచాయతీల అభివృద్ధి సైతం అనేక నిధుల ను సర్కారు కేటాయిస్తున్నది. గ్రామంలో గడిచిన ఐదేళ్ల కాలంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టా రు. కన్నాపూర్ పంచాయతీ పరిధిలో కన్నాపూర్ తో పాటు, చిన్నక్యాంపు, వకీల్‌నగర్, వెంకట్ నగర్, డ్యాంగూడ గ్రామాలున్నాయి. ఈ గ్రామా ల పరిధిలో మొత్తం ఓటర్లు 1013 మంది కాగా, జనాభా 1520 మంది ఉన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకాధికారులు ఇంటింటా తిరుగుతూ ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించా రు. ఐదేళ్ల కాలంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూశారు. దీంతో గ్రామం స్వచ్ఛతా హీ సేవా అవార్డుకు ఎంపికైంది.
గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు..
కన్నాపూర్ పంచాయతీలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. పంచాయతీకి నూతన కార్యా లయ భవనం నిర్మించారు. ట్రాక్టర్, ట్రాలీ కొను గోలు చేశారు. ఐదుగురు మల్టీపర్సస్ వర్కర్లతో నిత్యం తడి, పొడి చెత్త తరలిస్తున్నారు. దాని ద్వారా ఎరువు తయారీ చేస్తున్నారు. హరితహారం లో భాగంగా నాటిన మొక్కలకు నిత్యం నీరు అందిస్తునానరు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచ డంతోపాటు 70 శాతం సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. నిత్యం డ్రైనేజీల క్లీనింగ్, అవసరమైన చోట కల్వర్టుల నిర్మాణం చేపడుతున్నారు. పంచా యతీలో రెండు పల్లె ప్రకృతి వనాలు, రెండు క్రీడా ప్రాంగణాలు, శ్మశాన వాటిక నిర్మాణం, సెగ్రిగేషన్ షెడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, మన ఊరు-మన బడి కింది అభివృద్ధి పనులు, నర్సరీ, వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్ వంటి అనేక పనులు చేపట్టారు. జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపి కైంది. స్వచ్ఛతా హీ సేవా అవార్డును మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ వరుణ్‌రెడ్డి నుంచి సర్పం చ్ అందుకున్నారు.
అభివృద్ధి పనులతోనే అవార్డు వచ్చింది..
గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులతో పంచా యతీ ఉత్తమ అవార్డుకు ఎంపికైంది. గ్రామంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశాం. నిత్యం పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దీంతో అభివృద్ధిని గుర్తించి జిల్లాస్థాయిలో ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేయడం ఆనందాన్చింది. ఈ అవార్డుతో మరింత బాధ్యత పెరిగింది.
– ఐదు భూమేశ్, కార్యదర్శి(కన్నాపూర్)
ప్రజలు, అధికారుల సహకారంతోనే గ్రామం లో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. దీంతో మా గ్రామానికి అవార్డు వచ్చింది. ఆనందంగా ఉంది. మరింత బాధ్యతతో ముందుకెళ్తాం. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వ సహకా రంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాం.
– లోక నరేందర్‌రెడ్డి, సర్పంచ్, కన్నాపూర్