పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
బోధకాలు వ్యాధిగ్రస్తులు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ అన్నారు.
- డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్
- బోధకాలు వ్యాధిగ్రస్తులకు అవగాహన
బేల, డిసెంబర్ 23 : బోధకాలు వ్యాధిగ్రస్తులు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం బోధకాలు వ్యాధిగ్రస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధకాలు వ్యాధిగ్రస్తులు పరిసరా శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వలు ఉన్నట్లయితే దోమలు పెరుగుతాయని పేర్కొన్నారు. దోమలు కుట్టకుండా చూసుకోవాలని సూచించారు. బేల మండలంలో 129 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారని, ఎవరికైనా పింఛన్ లేనట్లయితే తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి శ్రీధర్, డాక్టర్ క్రాంతి కుమార్, ఆశ కార్యకర్తలు, నర్సులు, వివిధ గ్రామాల వ్యాధిగ్రస్తులు , తదితరులు పాల్గొన్నారు.
బోధకాలు వ్యాధికి జాగ్రత్తలు తీసుకోవాలి
ఇచ్చోడ, డిసెంబర్ 23: బోధకాలు వ్యాధి ఉన్న వారు ఇంటి వద్దనే పలు జాగ్రత్తలు తీసుకోవాలని పీహెచ్సీ డాక్టర్ సాగర్ సూచించారు. మండలంలోని పీహెచ్సీలో జాతీయ కిటక జనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమం నిర్వహించారు. 54 మంది వ్యాధిగ్రస్తులకు బోధకాలు మందుల కిట్ అందజేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది రవీందర్, వెంకట్ రెడ్డి, ఉత్తమ్సింగ్, కైలాస్, కిరణ్, సుభాష్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

