పకా ప్రణాళికతో చదివి చకటి విషయ ప్రదర్శన చేయగలిగితే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మారులు సాధించవచ్చు. వచ్చే నెల 3వ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలుకానున్న నేపథ్యంలో చివరి నిమిషం వరకు ఏయే విషయాలపై దృష్టి సారించాలనే విషయం సబ్జెక్టుల వారీగా నిపుణులు తమ సూచనలు, సలహాలు అందజేశారు. ఈ ఏడాది ప్రశ్నాపత్రం రూపురేఖలు మార్చడం, చాయిస్ తకువగా ఉండడంతో ఎలా సిద్ధం కావాలి. పది జీపీఏ ఎలా సాధించవచ్చనే అంశంపై పలువురు సీనియర్ ఉపాధ్యాయుల మనోగతం..
తెలుగు
భాషపై పట్టు తప్పనిసరి..
తెలుగులో 80 మారులకు 20 మారులు అవగాహన, ప్రతిస్పందన నుంచి పొందొచ్చు. దానశీలం, భిక్షపాఠాల నుంచి చుక గుర్తు పద్యాల్లో ఒకటి అడిగే అవకాశముంది. ఆధునిక పద్య పాఠాలు, వీర తెలంగాణ, శతక పద్యాల నుంచి ఒకటి వస్తుంది. అపరిచిత గద్యం ప్రతి ప్రశ్నకు రెండు మార్పులు ఉన్నందున అర్థం చేసుకొని 1 లేదా 2 మాటల్లో జవాబు రాయాలి. స్వీయరచన, సృజనాత్మకత, వ్యక్తీకరణ చిన్న ప్రశ్నల్లో ఒక కవి పరిచయం అడుగుతారు. ఇదే విభాగంలో ఏదైనా ఒక శతక సారాంశం లేదా భావం ప్రశ్న అడుగుతారు. వ్యాసరూప ప్రశ్నలకు రామాయణంపై పట్టు ఉంటే మంచి మారులు సాధించొచ్చు. సృజనాత్మక రచనల విభాగంలో పాఠ్యాంశాల ప్రధాన భావనల ఆధారంగా సంభాషణ, కరపత్రం, గేయం, కవిత, నినాదాలు, సూక్తులు, ప్రశ్నావళి అడగనున్నందున దృష్టి సారించాలి. పాఠాల భావం ఆధారంగా అవగాహన, నేర్చుకున్న అంశాలను గుర్తించడం, సమర్థన, కవి ఉద్దేశాలను సొంత మాటల్లో చెప్పేలా రాసేందుకు అభ్యసనం చేయాలి. – నరేందర్, తెలుగు, జడ్పీ హైస్కూల్, వాంకిడి.
ఇంగ్లిష్
భయం వీడితే మార్కుల వరద
ఆంగ్లమనే భయం వీడితే మంచి మారులు సాధించొచ్చని ఆంగ్ల ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ప్రశ్నాపత్రంలో 1 నుంచి 4, 5 నుంచి 8 ప్రశ్నలు రీడింగ్ విభాగంలో పాఠ్యపుస్తకం నుంచి ఇచ్చే ప్యాసేజ్ చకగా చదివాక ప్రతి ప్రశ్నకు మూడు వ్యాక్యాల సమాధానం రాయాలి. why do you think ,what do you think, How would you respond, what would you you do వంటి ప్రశ్నలు అడిగితే if i were, ….i would వంటి వ్యాక్యంతో సమాధానాలు మొదలుపెడితే మంచిది. WHY అనే పదంలో ఉన్న ప్రశ్నకు BECAUSE తో సమాధానం రాయాలి. కాంప్రహెన్సివ్ ప్యాసేజ్లో ఈ ఏడాది కొత్తగా స్టడీ సిల్స్ అంశం చేర్చారు. pie chart, bar graph, tree diagram, Flow chart ఇస్తారు. ప్రశ్న ఆధారంగా ఆలోచించి సమాధానం రాయాలి. సృజనాత్మక వ్యక్తీకరణ విభాగంలో విద్యార్థుల స్కిల్స్ పరిశీలించి మార్కులు వేస్తారు. major discourseల్లో కనీసం 4 నుంచి 6 పేరా గ్రాఫ్‌లో రాయాలి. పోస్టర్, ఇన్విటేషన్, ప్రొఫైల్, నోటీస్, మెస్సేజ్, డైరీ ఎంట్రీ అంశాలపై అడిగే ప్రశ్నకు ఒక పేజీలోనే రాయాలి. ఒక పార్ట్-బీలో 20 మార్కులకు ప్రశ్నలుంటాయి. ప్యాసేజ్, పోయంలో ఒకటి ఇస్తుండగా, పూర్తిగా అర్థం చేసుకొని అడిగిన ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఎడిటింగ్ ప్రశ్నలు వ్యాకరణాంశాలు, పాఠ్యపుస్తకం ఆధారంగా vocobulary basad ప్రశ్నలు ఉంటాయి. పాఠ్యపుస్తకం క్షుణ్ణంగా చదివితే మంచి సమాధానాలు రాయచ్చు.
– చునార్కర్ తుకారాం, ఎస్ఏ ఆంగ్లం,జడ్పీహెచ్ఎస్, రెబ్బెన
Adilabad4
హిందీ
అర్థం చేసుకుంటే సులువు….
హిందీపై పట్టు సాధించి, భాషా జ్ఞానాన్ని పెంచుకుంటే అపజయం ఉండదు. పఠిత గద్యాంశం పుస్తకంలోని నాలుగు ఉపవాచక పాఠాల నుంచే ప్రశ్నలు అడుగుతారు. పఠిత పద్య 1,2,4(బరసతే బాదల్, మా ముఝే అనేదే, కణ్కణ్కా అధికారి) పాఠశాల నుంచి ఒక పద్యం ఇచ్చి ఐదు ప్రశ్నలు వేస్తారు. పద్యాల భావం క్షుణంగా నేర్చుకుంటే మంచి మార్కులు వస్తాయి. రెండో విభాగం.. నాలుగు మార్కుల ప్రశ్నల్లో ఒకటిగా ఉండే కవి పరిచయం కోసం చరిత్రలు నేర్చుకోవాలి. ఎనిమిది మార్కుల ప్రశ్నలు పద్యభాగం, గద్యభాగం నుంచి రెండేసి అడుగుతారు. ఇదే విభాగంలో సృజనాత్మకత విషయంలో లేఖ, సాక్షాత్కార్, బాత్ చీత్, నారే, విజ్ఞాపన్, కరపత్ వ్యాసాల్లో రెండు అడిగితే ఒకటి రాయాలి. బిట్ పేపర్లో 20 మార్కులకు 10 మార్కులు భాషాకీ బాత్ పాఠాల వెనక గ్రామర్ పాయింట్లు, మరో 10 మార్కులు వ్యాకరణాంశాలపై అడగొచ్చు.
– అలీ మునీసా, హిందీ, బీసీ గురుకులం, ఆసిఫాబాద్
మ్యాథ్స్
ప్రయత్నిస్తే విజయమే..
మంచి మారుల కోసం 14 చాప్టర్లపై పట్టు సాధించాలి. ప్రభుత్వం ఇచ్చిన అభ్యాసదీపిక లోని నమూనా ప్రశ్నలు సాధన చేస్తే మంచి మారులు పొందవచ్చు. గ్రాఫ్ సమస్యలు సాధించేటప్పుడు తప్పక సేల్, సాధన రాయాలి. నిర్మాణ పటం గీసేటప్పుడు నిర్మాణ క్రమం, నిర్ధారణ కూడా రాయాలి. వాస్తవ సంఖ్యల్లో లాగరిథమ్స్, సమితులలో వెన్ చిత్రాలు, సెట్ బిల్డర్ సామ్, రోస్టర్ ఫామ్ రాయడం, బహుపదుల్లో పరావలయం గీయడం, సంభావ్యత, సంఖ్యాక శాస్త్రంలో మీన్, మీడియన్, మోడ్ లెక్కలతోపాటు ఓజివ్ గ్రాఫ్లే కాక, సరూప త్రిభుజ నిర్మాణాలు, వృత్తానికి స్పర్శరేఖలు గీయడం త్రికోణమితి అనువర్తనాలు నుంచి బొమ్మ గీయడం ప్రాక్టీస్ చేయాలి. కీలకాంశాలను ప్రతిరోజూ రాసుకోవడం వల్ల గుర్తు పెట్టుకోవచ్చు. గణితంపై భయపడకుండా సాధన చేసి గుర్తు ఉన్న వరకు జవాబులు రాస్తే మంచి మార్కులు సొంతమవుతాయి.
సాంఘిక శాస్త్రం
పట్టికలు, గ్రాఫులు కచ్చితం
అన్ని ప్రశ్నలకు ఒకేతీరుగా కాకుండా అడిగిన విధానాన్ని బట్టి సమాధానం రాయాలి. వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు కారణాలు, పోలికలు, బేధాలు, ఫలితాలు, ప్రభావితం చేసే అంశాలను వర్గీకరించడం, ఉదాహరణలతో వివరించాలి. పట్టికలు, గ్రాఫులు కచ్చితంగా అడిగే అవకాశం ఉంది. ఇచ్చిన డేటా ఆధారంగా విశ్లేషణ చేయడంతోపాటు కారణాలు, ఉదాహరణలు, ఫలితాలే కాకుండా సూచనలు, పరిషార మార్గాల వంటి వాటితో మంచి మార్కులు ఖాయం. తెలంగాణ, భారతదేశం ఔట్‌లైన్, నదులు, పీఠభూములు, ప్రపంచయుద్ధంలో పాల్గొన్న దేశాలు, రాజధానులు, అంతర్జాతీయ సంస్థల కేంద్ర స్థానాలపై దృష్టిపెట్టాలి. వీటికి తోడు కరపత్రాలు, నినాదాలు, లేఖలు, ప్రపంచశాంతి, బాలికావిద్య, సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత.. గాంధీ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకుల నుంచి నేర్చుకున్న విషయాలపై అడిగే ఆస్కారం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన అభ్యాస దీపికలు కూడా చదవాలి.
– సురేందర్, సాంఘిక శాస్త్రం, జడ్పీ హైస్కూల్, వాంకిడి.
జీవ శాస్త్రం
బొమ్మలే ఆయువు పట్టు
సామాన్య శాస్త్రం రెండు పేపర్లుగా ఉంటుంది. పార్ట్-బీకి గంటన్నర సమయం ఉండగా.. 40 మారుల ప్రశ్నాపత్రానికి సమాధానాలు రాయాలి. హైడ్రిల్లా ప్రయోగం, సీ 02 అవసరం. కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరం, శ్వాసక్రియలో సీ 02 ఉష్ణం విడుదవుతోందని చూపే ప్రయోగాలు నేర్చుకుంటే ఎనిమిది మార్కులు సొంతమవుతాయి. ఇక మానవుని జీర్ణవ్యవస్థ, ఏక వలయ, ద్వివలయ రక్త ప్రసరణ మూత్రపిండాలు అంతర్నిర్మాణం బొమ్మలను నేర్చుకుంటే ఆరు మార్కులు సాధించొచ్చు. స్వయం పోషకాలు, పర పోషకాల బేధాలు, కిరణ జన్య సంయోగ క్రియ-శ్వాసక్రియ బేధాలు, కాంతి చర్య-నిష్కాంతి చర్య, అలైంగిక ప్రత్యుత్పత్తి, సమ, క్షయకరణ విభజన, మెండల ప్రతిపాదన సూత్రాలు, పర్యావరణ సంరక్షణపై పట్టు పెంచుకుంటే ఈ విభాగంలో 18 మార్కులు సాధించొచ్చు.
– వడ్లూరి రాజేశ్, జీవశాస్త్రం, జన్కాపూర్, ఆసిఫాబాద్
ఫిజిక్స్
్రప్రణాళికా ప్రధానం
ఫిజిక్స్, బయోలజీ కలిపి ఒకే రోజు పరీక్ష రాయాల్సి ఉన్నందున ముఖ్యమైన విషయాలు గుర్తు పెట్టుకుంటే మంచి మారులు సాధించవచ్చు. ప్రయోగాలకు తొమ్మిది మారులు కేటాయించారు. రెండు మార్కుల ప్రశ్నలుగా.. ప్రయోగ సామగ్రి పరిశీలన, ఫలితాల్లో ఒకటి అడుగుతారు. ఆరు మారుల ప్రశ్నల్లో ఒక ప్రయోగ విధానం తప్పనిసరిగా వస్తుంది. పీ ఆర్బిటాల్ ఆకృతులు, ప్రయోగ అమరికలు చూపే పటాలు, కిరణ చిత్రాలు, అణువులు ఆకృతి నేర్చుకోవాలి. పట్టిక లేదా ఇతర రూపంలో ఇచ్చే ప్రశ్నల్లో పదార్థం పీహెచ్, దృష్టి దోషాలు, క్వాంటం సంఖ్యలు, ఆవర్తన పట్టిక, హైడ్రోకార్బన్ ధర్మాల వంటి అంశాలపై వివరాలు, పటాలు గుర్తుంచుకోవాలి. విషయ అవగాహనలో 18 మారులకు వచ్చే ప్రశ్నల్లో బ్లీచింగ్ పౌడర్, వాషింగ్ సోడా ఉపయోగాలు, కుంభాకార, పుటాకార దర్పణాల బేధాలు, ఆవర్తన పట్టిక లక్షణాలు వంటివి చదవాలి.
– శ్రీనివాస్, ఫిజిక్స్, జడ్పీ హైస్కూల్, వాంకిడి.