ODI Century Stars : ఫార్మాట్ ఏదైనా సెంచరీ కొడితే ఆ కిక్కే వేరు. వన్డేల్లో అయితే శతక వీరులకు ఓ క్రేజ్ ఉంటుంది. అందుకే మూడంకెల స్కోర్ చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటారు కొందరు. ఒక శతకంతోనే సంతృప్తి చెందకుండా వరుసపెట్టి వంద కొట్టేస్తూ అసాధారణ ఆటగాళ్లుగా కీర్తిని గడిస్తారు. శుభారంభాన్ని యాభైగా.. ఆ ఫిఫ్టీని శతకంగా మలిచే అరుదైన ఆటగాళ్లు కొందరున్నారు. అలాంటి ఐదుగురు క్రికెటర్లలో మన విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా ఉన్నాడు. వన్డే ఫార్మాట్లో రన్ మెషీన్‌గా, అత్యధిక శతకాల యోధుడిగా ఘనతలు సాధించిన విరాట్.. వచ్చే వరల్డ్ కప్‌లోనూ ఆడితే మరిన్ని రికార్డు బద్ధలవ్వడం ఖాయం. ఫిఫ్టీలను సెంచరీలుగా మలచడంలో దిట్ట అని నిరూపించుకున్న మిగతా నలుగురు ఎవరంటే..?
విలువిద్యలో ఏకలవ్యుడు, అర్జునుడు.. వంటి గురి తప్పని వీరుల గురించి చదివాం. యావత్ ప్రపంచానికి వ్యాపించిన క్రికెట్లోనూ అలాంటి గురి తప్పని ఆటగాళ్లు కొందరున్నారు. పరుగుల ఖాతా తెరిచి వీళ్లు హాఫ్ సెంచరీ సాధించారంటే.. సెంచరీ గ్యారంటీ అని ఫ్యా్న్స్ ఫిక్స్ అయిపోతారు. వీరు చెలరేగి ఆడితే దాదాపు తొంభై సందర్భాల్లో యాభై కాస్త వందగా మారాల్సిందే. ఇంతటి ఘనమైన రికార్డు ఏ దిగ్గజ ఆటగాడి పేరుమీదనో ఉందనుకునుకుంటే పొరపడినట్టే. ఎందుకంటే.. వన్డే క్రికెట్లో ఈ మధ్యే వెలుగులోకి వచ్చిన స్కాట్లాండ్ క్రికెటర్ పేరిట ఉందీ అరుదైన రికార్డు. అతడి పేరు కైల్ మెక్లీడ్(Kyle MacLeod).
𝑸𝑫𝑲 𝒊𝒔 𝒃𝒂𝒄𝒌 𝒘𝒊𝒕𝒉 𝒂 𝒃𝒂𝒏𝒈! 💥
Proteas opener Quinton de Kock now sits just behind Scotland’s Kyle MacLeod for the highest century conversion rate in ODI history! 🇿🇦💯#QuintondeKock #ODIs #SouthAfrica #Sportskeeda pic.twitter.com/iIrlKTdUpq
— Sportskeeda (@Sportskeeda) November 6, 2025
కుడిచేతి వాటం బ్యాటర్ అయిన మెక్లీడ్ వన్డేల్లో సెంచరీల వీరుడిగా పేరొందాడు. ఈ ఫార్మాట్లో అతడు అద్భుతమని చెప్పడానికి బ్యాటింగ్ గణాంకలు చూస్తే చాలు. 87 వన్డేలు మాత్రమే ఆడినఈ చిచ్చరపిడుగు పేరిట 13 అర్ధ శతకాలు.. 10 సెంచరీలు ఉన్నాయి. అతడిని యాభై దాటనిస్తే వంద కొట్టేదాకా ఔట్ కాడు. అందుకే మెక్లీడ్ 43.48 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాటర్ క్వింటన్ డికాక్ (Quinton De Kock) పేరిటే రెండో స్థానంలో ఉన్నాడు.
Hashim Amla’s ODI peak doesn’t get spoken of enough.
From 2010–2015: 5100+ runs at 53.75, 20 tons.
Only Kohli had more centuries in that period.pic.twitter.com/c1v7nr9JWB— House_of_Cricket (@Houseof_Cricket) October 16, 2025
రెండేళ్ల క్రితం వీడ్కోలు నిర్ణయం వెనక్కి తీసుకొని వన్డే ప్రపంచ కప్ ఆడిన డికాక్.. ఇటీవల చెలరేగి ఆడుతున్నాడు. పాకిస్థాన్‌తో వన్డే సిరీస్ రెండో మ్యాచ్‌లో సెంచరీ బాదిన అతడు.. తన శతకాల శాతాన్ని 41.50కి పెంచుకున్నాడు. ప్రస్తుతం ఈ లెఫ్ట్ హ్యాండర్ ఖాతాలో 31 ఫిఫ్టీలు, 22 శతకాలు ఉన్నాయి. ఈ జాబితాలో దక్షిణాఫ్రికాకే చెందిన మాజీ ఆటగాడు హషీం ఆమ్లా (Hashim Amla)ది మూడో ప్లేస్. ఈ సొగసరి బ్యాటర్ 40.91 శాతం ఉందంటే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఆమ్లా తన కెరీర్లో 39 అర్ధ శతకాలు, 27 సెంచరీలు బాదాడు.
వన్డేల్లో అత్యుత్తమ ఆటగాడిగా చరిత్రకెక్కిన కోహ్లీ 2017, 2018, 2023లో ఆరేసి శతకాలతో వార్తల్లో నిలిచాడు. రెండేళ్ల క్రితం స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై సెంచరీతో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డు బ్రేక్ చేసిన విరాట్ 40.48 శాతంతో నాలుగో ప్లేస్‌లో నిలిచాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటన చివరి వన్డేలో హాఫ్ సెంచరీ బాదిన కోహ్లీ పేరిట 75 ఫిఫ్టీలు.. 51 సెంచరీలు ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) టాప్- 5లో చోటు దక్కింది. ఈ లెఫ్ట్ హ్యాండర్ యాభైలను సెంచరీలుగా మలిచే విషయంలో 40.00 శాతంతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. విధ్వంసక ఓపెనర్ అయిన వార్నర్ తన కెరీర్లో 33 అర్ధశతకాలు, 22 సెంచరీలు సాధించాడు.
#OnThisDay in 2023, on his 35th birthday, Virat Kohli scored his 49th ODI hundred. The master batter equalled Sachin Tendulkar’s record for the most ODI tons.
10 days later in the semi-finals of the 2023 World Cup, Kohli scored his 50th ton🔥#HappyBirthdayViratKohli pic.twitter.com/MzvRpl4IjW
— Cricket.com (@weRcricket) November 5, 2024