నస్పూర్, జనవరి 25 : దేశ పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హకు అత్యంత శక్తివంతమైనదని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒకరూ తమ వివరాలు నమోదు చేసుకొని ఓటు హకు పొందాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. ఆదివారం నస్పూర్‌లోని కలక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన 16వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల్లో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్, ప్రోగ్రాం అధికారి ప్రసాద్‌తో కలిసి మాట్లాడారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా వీడియో ద్వారా భారత ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సందేశాన్ని అందించారు.
బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మాట్లాడుతూ 1950 జనవరి 25వ తేదీన ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం స్థాపించబడిందని, ప్రపంచంలోనే మన దేశం అతి పెద్ద ప్రజాస్వా మ్యం కలిగి ఉందని అన్నారు. అనంతరం ‘నా భారతదేశం-నా ఓటు’ అనే నినాదంతో అధికారులు, సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చే యించారు. ఓటు హకును సక్రమంగా వినియోగించుకున్న సీనియర్ సిటిజన్స్, యంగ్ ఓటర్స్, దివ్యాంగ ఓటర్లు, ఓటు హకు నమోదు చేయడానికి కృషి చేసిన ఉత్తమ బూత్ స్థాయి అధికారులు, స్వీప్ నోడల్ ఆఫీసర్, ఓటు హకు వినియోగంపై ప్రచారం చేసిన కళాజాత బృందాన్ని, లక్షెట్టిపేట, హాజీపూర్ తహసీల్దార్లను శాలువాతో సతరించి జ్ఞాపికలు, ధ్రువపత్రాలు అందజేశారు.
ఓటు హకును వినియోగించుకోవాలి : ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారీ
ఆసిఫాబాద్ టౌన్, జనవరి 25 : ప్రజాస్వామ్యానికి ఓటు హకు అత్యంత కీలకమని, ప్రతి ఒకరూ ఓటు హకును వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురసరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ డేవిడ్,ఆర్డీవో లోకేశ్వర్ రావు, అధికారులతో కలిసి ర్యాలీ తీశారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒకరూ చురుకుగా పాల్గొని, స్వేచ్ఛాయుతంగా ఓటు హకును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.