బడిలో భద్రమేనా..?
జిల్లాలోని సర్కారు బడులతో పాటు ఆశ్రమాలు, రెసిడెన్సియల్స్, వసతిగృహాలు సమస్యలతో సతమతమవుతున్నాయి.
- సమస్యలతో సతమతమవుతున్న విద్యాలయాలు
- ఊడిన తరగతి గదుల తలుపులు, కిటికీలు
- వేలాడుతున్న విద్యుత్ వైర్లు.. పై కప్పులేని బావులు
- పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో చిత్తడిగా ఆవరణలు
- వానకాలంలో తేళ్లు, పాములతో పొంచి ఉన్న ప్రమాదం
- భయం భయంగా చదువులు సాగిస్తున్న విద్యార్థులు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని సర్కారు బడులతో పాటు ఆశ్రమాలు, రెసిడెన్సియల్స్, వసతిగృహాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ఊడిన తలుపులు, కిటికీలు.. వేలాడుతున్న విద్యుత్ వైర్లు.. పై కప్పులేని బావులు, కూలిన ప్రహరీలు, తెరచి ఉన్న నీటి సంపులు, పిచ్చిమొక్కలతో చిత్తడిగా మారిన ఆవరణలు.. ఇలా ఒకటేమిటి అనేక సమస్యలతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. వానకాలం కావడంతో పాములు, తేళ్లతో పాటు విషపురుగులు సంచరించే అవకాశముండగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంభయంగా గడపాల్సిన దుస్థితి దాపురించింది.
అధికారుల పట్టింపేదీ?
జిల్లాలో గిరిజన సంక్షేమ ఆశ్రమాలతో పాటు బీసీ, ఎస్సీ రెసిడెన్సియల్ పాఠశాలలు, వసతి గృహాలు దాదాపు 80 వరకు ఉండగా, దాదాపు 18 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యాసంస్థల ప్రారంభానికి ముందే సౌకర్యాలపై దృష్టి సారించాల్సిన అధికారులు, ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఆశ్రమాలు, రెసిడెన్సియల్స్, వసతిగృహాల్లో డార్మెట్రీలు.. మొదలుకొని టాయిలెట్స్, స్నానాల గదులు, వంటశాలలు, చివరికి తరగతి గదుల్లో కూడా విద్యార్థులకు భద్రత కొరవడుతున్నది. రాత్రింబవళ్లూ భయాందోళనల నడుమ చదువులు సాగించాల్సి వస్తున్నదని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల సిర్పూర్(టీ) మండలం అచ్చంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలోని నీటి సంపు వద్ద మూడో తరగతి విద్యార్థిని దర్శితను పాము కాటు వేయగా, స్థానికుల సకాలంలో స్పందించడం వల్ల ప్రాణాపాయం తప్పింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి. కాగా, ప్రస్తుతం విద్యాలయాలు అధ్వానంగా మారాయనడానికి ‘నమస్తే తెలంగాణ’ తీసిన ఈ చిత్రాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ విషయమై జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవిని వివరణ కోరేందుకు యత్నించగా, అందుబాటులోకి రాలేదు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

