మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 24 : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, అప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకోగలరని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వీ నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మంచిర్యాలలోని అల్ఫోర్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఇంటర్, ఐఐటీ మెయిన్స్, సీబీఎస్ఈ, తదితర పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని, మే-లో మరిన్ని పరీక్షల ఫలితాలు వస్తాయని, పరీక్ష ఏదైనా ఉత్తమ ఫలితాలు అల్ఫోర్స్ కాలేజీవేనని అన్నారు.
ఆంధ్రా కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా తెలంగాణ రాష్ట్రంలో అల్ఫోర్స్ విద్యాసంస్థలు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నాయని, మంచిర్యాల జిల్లా నుంచి ర్యాంకులు సాధించడం చాలా ఆనందంగా ఉన్నదన్నారు. తమ కాలేజీలో చదివిన విద్యార్థులు ఎంపీసీలో 996, బైపీసీలో 995 మార్కులు సాధించారని, ఫస్టియర్‌లో 470 మార్కులకుగాను 468 మార్కులు, బైపీసీలో 440 మార్కులకుగాను 438 మార్కులు సాధించారన్నారు. ఆర్ట్స్, కామర్స్‌లో కూడా 500 మార్కులకు 983, 486 మార్కులు వచ్చాయని అన్నారు. ఎంసెట్, నీట్, ఐఐటీలలో కూడా విద్యార్థులు రాణిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యంత అనుభవమున్న ఫ్యాకల్టీ మంచిర్యాలలో ఉన్నదని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటామని పేర్కొన్నారు.
గ్రాడ్యుయేషన్‌డే సెలబ్రేషన్స్
మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులోగల అల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో శుక్రవారం గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. యూకేజీ పూర్తిచేసుకుని ఒకటో తరగతిలోకి ప్రవేశిస్తున్న 34మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వీ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రిన్సిపాల్ రాజమణి, బోధనా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.