ఉట్నూర్ రూరల్ / ఉట్నూర్ : విద్యార్థులకు నాణ్యమైన విద్యను ( Quality Education) అందిస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ( MLA Vedma Bojju Patel ) అన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండలంలోని లక్కారంలో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5 రోజుల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సామర్థ్య నిర్మాణ శిక్షణ తరగతుల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశలో నాణ్యమైన విద్య అందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలోనీ మారుమూల గ్రామీణ ప్రాంతాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రణాళిక బద్ధంగా ఉపాధ్యాయులు విద్యను బోధించాలన్నారు. అనంతరం ఇటీవల వెలువడిన సివిల్ ఫలితాల్లో 76వ ర్యాంకు సాధించి సత్తా చాటిన సాయి చైతన్య తల్లిని శాలువాతో సత్కరించి,శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఆశన్న, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
టీబీ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్ : ప్రతి ఒక్కరూ క్షయ వ్యాధి నివారణకు కృషి చేయాలని,ఈ వ్యాధిని అరికట్టాలంటే వ్యాధి సోకిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ( MLA Vedma Bojju Patel ) పేర్కొన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైద్య శాఖ సిబ్బందితో కలిసి టీబీ ముక్త భారత్ కు (TB Free Society ) సంబంధించిన గోడ పత్రులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా టీబీ కంట్రోలర్ అధికారిణి డాక్టర్ సుమలత, జిల్లా టీబీ కో-ఆర్డినేటర్ జాదవ్ సుదర్శన్, టీబీ సూపర్వైజర్లు వెంకటేశ్వర్, అంబారావు ల్యాబ్ టెక్నీషియన్ వేణు తదితరులు పాల్గొన్నారు.