దండేపల్లి, మే31 : మండలంలోని ద్వారక జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 1995-96 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు సమ్మేళనం నిర్వహించారు.
చదువులు ముగించుకొని భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్లిన వారంతా 29 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై చేరి సందడి చేశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అప్పటి గురువులను సన్మానించారు.