చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ హెచ్చరించారు. సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంఘమల్లయ్యపల్లెలో బుధవారం రాత్రి పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఇంటింటికీ తిరుగుతూ తనిఖీలు చేపట్టారు.
- మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్
- నస్పూర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
సీసీసీ నస్పూర్, మే 14ః చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ హెచ్చరించారు. సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంఘమల్లయ్యపల్లెలో బుధవారం రాత్రి పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఇంటింటికీ తిరుగుతూ తనిఖీలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, శాంతిభద్రల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్ట వేయడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ ప్రాంతంలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి పనిచేస్తున్న వ్యక్తులపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ఇండ్లు రెంట్‌కు ఇచ్చే యజమానులు పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. సంఘమల్లయ్యపల్లెలో రద్దీగా ఉండే దుకాణాలు, ప్రధాన చౌరస్తాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, సీసీసీ నస్పూర్ ఎస్ఐ మేకల ప్రశాంత్, మంచిర్యాల ఎస్ఐ శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి.
లక్షెట్టిపేట, మే 14 : ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గిడి భాసర్ మిల్లర్లకు సూచించారు. గురువారం లక్షెట్టిపేట మండలంలోని పలు గ్రామాల్లోని రైస్ మిల్లులను డీసీపీ, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్‌తో కలిసి సందర్శించారు. లక్షెట్టిపేట తహసీల్దార్ దిలీప్‌కుమార్‌తో కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంట వెంటనే మిల్లర్లు దింపుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేశ్, మిల్లర్లు కేంద్రం నిర్వాహకులు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

