నెన్నెల : విద్యుత్ వినియోగదారుల ( Electricity problems ) సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు అన్న చర్యలు తీసుకుంటున్నామని ఎన్పీడీసీఎల్ సభ్యులు ( NPDCL Members ) సలాంధ్ర రామకృష్ణ, లకావత్ కిషన్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా నెన్నెల( Nennela) మండల కేంద్రం రైతువేదికలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. నాలుగు మండలాలకు చెందిన వినియోగదారులు ఈ కార్యక్రమంలో పాల్గొని పలు ఫిర్యాదులు చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వినియోగదారులకు ఎప్పటికప్పుడు సమస్యలను తీర్చడానికి వేదికలు ఏర్పాటు చేశామని అన్నారు. వ్యవసాయ విద్యుత్ కనక్షన్లను ప్రభుత్వ ఆదేశాల మేరకు అందిస్తామన్నారు. గృహ వినియోగదారులకు ఉన్న ఇబ్బందులు కూడా తీరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి డివిజనల్ ఇంజనీర్ బానోతు రాజన్న , అడిషనల్ డివిజనల్ ఇంజినీర్ ఎంబడి రవికుమార్, అసిస్టెంట్ ఇంజినీర్లు, సబ్ ఇంజినీర్లు, వినియోగదారులు పాల్గొన్నారు.