రెబ్బెన, ఫిబ్రవరి 23 : గంగాపూర్లో కొలువైన శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి కాల్యాణోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా సా గింది. భక్తులు వేలాదిగా తరలిరాగా, గోవింద నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. వేదపండితులు శ్రీనివాసాచార్యులు, వేణుగోపాలాచార్యులు, మురళీధరచార్యులు, రామకృష్ణచార్యులతో పాటు ఆలయ ప్రధాన అర్చకుడు గణేశ్పంతులు ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు.
టీటీడీ ప్రతినిధి గొల్లపల్లి సత్యనారాయణ పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు, కంకణాలు, పుస్తకాలు తీసుకురాగా, బెల్లంపల్లి ఏరియా జీఎం రవిప్రసాద్ ఆలయం వరకు నెత్తిపై పెట్టుకొని వచ్చి స్వామి వారికి సమర్పించారు. సీఎఫ్వో వేణుగోపాల్గుప్తా, ఆలయ ఈవో బాపురెడ్డి, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు సౌకర్యాలు కల్పించారు. సీఐలు చిట్టిబాబు, శ్రీనివాస్, సతీశ్, ఎస్ఐలు చంద్రశేఖర్, రమేశ్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి ఏరియా జీఎం రవిప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్రావు స్వామి వారిని దర్శించుకున్నారు. పలు వ్యాపార సంస్థల ప్రతినిధుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
శనివారం వేంకటేశ్వరస్వామి జాతర, రథోత్స వం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశా రు. సాయంత్రం 6.15 గంటలకు రథంపై ఉత్సవ విగ్రహాలను ఊరేగించనున్నారు.