నార్నూర్ : ఆదివాసి సంస్కృతి, సాంప్రదాయాలు గొప్పవని ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం జామడ గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవాలు (Dandari Utsavam) బుధవారం ముగిశాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్( BRS) పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గుస్సాడీలకు, ఆదివాసి మహిళలకు శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసులు నిర్వహించే ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంద న్నారు. సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, కో ఆప్షన్ సభ్యుడు ఉద్ధవ్ కాంబ్లే, మండల అధ్యక్షుడు మెస్రం హన్మంతరావు, మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాసిం, చౌహన్ యశ్వంత్, గ్రామ పెద్దలు, మహిళలు ఉన్నారు.