ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జూన్ 23 : జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
శిథిలావస్థ ఇళ్లల్లో ఉన్నవారు, వాగులు..వంకలు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర సమయాల్లో 100కు డయల్ చేయాలని సూచించారు. 24 గంటల పాటు బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బంది గస్తీ నిర్వహించాలని పేర్కొన్నారు.