ఎదులాపురం, ఏప్రిల్ 5 : ప్రతి ఒక్క పోలీసుకు క్రమశిక్షణ తప్పనిసరి అని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు నిర్వహించిన పరేడ్‌లో ఎస్పీ పాల్గొని సిబ్బందికి సూచనలు చేశారు. మొదటగా రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెంకటి ఎస్పీకి గౌరవవందనాన్ని సమర్పించి, పరేడ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి పోలీసు క్రమశిక్షణ అనేది మెరుగుపడుతుందని, ప్రతి ఒకరికి పోలీసు క్రమశిక్షణ అనేది ముఖ్యమైనదని తెలియజేశారు. ప్రతి ఒకరికి పోలీస్ స్టేషన్లవారీగా వారాంతపు సెలవును అమలు చేయాలని సూచించారు. క్రమశిక్షణ తప్పిన ఉద్యోగులపై శాఖ పరమైన చర్యలు తప్పవని తెలియజేశారు. డిఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, సిహెచ్ నాగేందర్ పాల్గొన్నారు.