ఆదిలాబాద్ : డ్రగ్స్ నివారణలో అందరూ భాగస్వాములు కావాలి అని ఎస్పీ అఖిల్ మహజన్ పిలుపునిచ్చారు. వారం రోజుల పాటు జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన సందర్భంగా నిర్వహించే పలు కార్యక్రమాలలో భాగంగా మంగళవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా ఎస్పీ పోలీసు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని సిబ్బందికి సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదిలాబాద్ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా రూపుమాపే దిశగా పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రజలు గంజాయి, డ్రగ్స్ పై ఎలాంటి సమాచారం అయినా డయల్ 100 లేదా పోలీసు సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.