తల్లి కండ్ల ముందే..
బెల్లంపల్లి మండలంలోని దుగినెపల్లి రహదారిపై ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో కొడుకు మృతి చెందగా.. తల్లి తీవ్రంగా గాయపడింది. వివరాలిలా ఉన్నాయి.
- కుమారుడు మృత్యువాత
- తల్లికి తీవ్ర గాయాలు..
- బైక్‌ను మట్టి టిప్పర్ ఢీకొట్టడంతో ఘటన
బెల్లంపల్లిరూరల్, మార్చి 25 : బెల్లంపల్లి మండలంలోని దుగినెపల్లి రహదారిపై ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో కొడుకు మృతి చెందగా.. తల్లి తీవ్రంగా గాయపడింది. వివరాలిలా ఉన్నాయి. గురిజాల మాజీ సర్పంచ్ దుగుట తిరుపతి కుమారుడు దుగుట అజయ్ (24) తన తల్లి లలితతో కలిసి దుగినెపల్లి శివారులోని తమ పొలం వద్దకు సోమవారం సా యంత్రం ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. అదే సమయంలో అక్కడి వెంచర్లో మట్టిని అన్లోడ్ చేసి ఎదురుగా వస్తున్న టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుగుట అజ య్ అక్కడికక్కడే మృతి చెందాడు.
తల్లి లలిత కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తాళ్లగురిజాల పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ లలితతోపాటు అజయ్ మృతదేహాన్ని తమ వాహనంలోనే బె ల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లలిత పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం వైద్యులు మంచిర్యాలకు తరలించా రు. మృతి చెందిన అజయ్ హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడని, కొద్ది రోజుల కిందటే గ్రామానికి వచ్చాడని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

