నేరడిగొండ, జనవరి 2 : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సీనియర్ పురుషులు, మహిళల సాఫ్ట్‌బాల్ ఎంపిక పోటీలను సోమవారం ఎంపీపీ రాథోడ్ సజన్ ప్రారంభించారు. ఈ పోటీలకు 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. 25 మందిని ప్రాబబుల్స్‌కు ఎంపిక చేశారు. వారికి వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చి 16 మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ తెలిపారు.
కార్యక్రమంలో మండల విద్యాధికారి అన్రెడ్డి భూమారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతిరాం, గుత్పాల సర్పంచ్ గస్కంటి రవి, సాఫ్ట్‌బాల్ జాయింట్ సెక్రటరీ నాగరాజు, తిరుపతి, పీఈటీలు కవిత, గౌతం, సునీత, గణేశ్, తదితరులు పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
నేరడిగొండ మండల పీఆర్టీయూ టీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మార్సీలో ఎంపీపీ రాథోడ్ సజన్, ఎంఈవో అన్రెడ్డి భూమారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ జగదీశ్వరి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గంగాధర్, జిల్లా కార్యదర్శి మహేందర్, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పాషా, బ్రహ్మానందం, అసోసియేట్ అధ్యక్షుడు తానాజీ పాల్గొన్నారు.