తాండూర్ : నేటి సనాతన ధర్మంలో మన సంస్కృతిని, సమాజాన్ని రక్షించేది మానవుల సత్ప్రవర్తనేనని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవానాత రామానుజ జీయర్ స్వామి ( Ramanuja Jeeyar Swamy ) అన్నారు. శుక్రవారం తాండూర్ మండల కేంద్రంలోని విద్యాభారతి ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పరీక్షలు, సందేహాలు అనే అంశంపై మాట్లాడారు.
దేశ పౌరుడిగా దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడానికి విజ్ఞానాన్ని పెంపొందించు కోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కంప్యూటర్ యుగంలో అనేక మంది విద్యార్థి దశ నుంచి వృద్ధుల వరకు మొబైల్ వాడకాన్ని ఎక్కువగా వినియోగిస్తూ వాట్సాప్, ఇంస్టాగ్రామ్,ఫేస్బుక్, యూట్యూబ్‌ను ఎక్కువగా వాడుతున్నందున వికాస తరంగిణి ద్వారా సోషల్ మీడియాలో ప్రతిరోజు భగవద్గీతను శ్లోకాలు అందిస్తూ వాటి భావాన్ని తెలపడం జరుగుతుందన్నారు.
పాఠశాలకు మొదటిసారి వచ్చిన రామనాధ జీయర్ స్వామిని యాజమాన్యం వేద పండితుల మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభం స్వాగతం పలికి, పాదపూజ చేసుకున్నారు. ఈ కార్యక్రమములో ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శేఖర్ రావు, వికాస తరంగిణి, ప్రజ్ఞ వికాస సమితి సభ్యులు, పాఠశాల వ్యవస్థాపకులు సురభి ఆగమారావు, డైరెక్టర్ సురభి శరత్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.