నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మహాగావ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ( Government School ) ఆవరణలో గురువారం నాగుపాము ( Snake ) హల్చల్ చేసింది. పాఠశాల భవనం గుట్ట ప్రదేశానికి ఆనుకొని ఉండడంతో పాము వచ్చినట్లు స్థానికులు తెలిపారు. గమనించిన కొందరు పామును చంపేశారు. పాఠశాల చుట్టుపక్కల ప్రహారి గోడ లేకపోవడంతోనే విషపు పురుగులు పాఠశాలలోకి వస్తున్నాయని విద్యార్థులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి ప్రహారి గోడ మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.