కుంటాల : శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం మండల వ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో సీతారామలు కల్యాణాన్ని (Sitaramula Kalyanam) వైభవంగా జరుపుకున్నారు. కుంటాల (Kuntala ) వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పంతులు మోనాజీ చేతుల మీదుగా సీతారాముల కల్యాణం నిర్వహించారు. అనంతరం ప్రధాన వీధుల గుండా హనుమాన్ భక్తులు శోభాయాత్ర నిర్వహించారు.
ప్రాచీన శ్రీకృష్ణ మందిరం, కల్లూరు లోని దత్త వెంకట సాయి మందిరంలోనూ ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం ఆయా ఆలయాల్లో అన్న ప్రసాద వితరణ చేశారు. మాజీ ఎంపీపీ గజ్జరాం, ఆలయ కమిటీ సభ్యులు పిస గజ్జారం, సూధం మహేందర్, సోమ రాములు, వెంకట్రావు, వెంకటరమణ, జుట్టు వెంకటేష్, రమణారావు, భోగ గోవర్ధన్, మురళి, పండరి, మునీశ్వర్ రాజు, రాధాకృష్ణ, అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.