తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ సింగరేణి బెల్లంపల్లి ఏరియా పరిధిలోని మాదారం టౌన్ఫిప్లో గల పిల్లల పార్కు (Singareni Park ) సింగరేణి అధికారుల నిర్లక్ష్యంతో నిరాదరణకు గురవుతోంది . పట్టించుకోవాల్సిన సింగరేణి అధికారులు అలసత్వం ప్రదర్శిస్తుండడంతో గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగాయి. గతంలో పార్కు నిర్వహణకు సిబ్బందిని ( Staff ) కేటాయించి పనులు నిర్వహించేవారు. ఇటీవల సిబ్బందిని నియమించక పర్యవేక్షణ లేకపోవడంతో పార్కు నిరుపయోగంగా మారింది.
సెలవుల్లో పిల్లలు ఆటవిడుపునకు పార్కుకు వెళ్లలేని దుస్థితి నెలకొంది. స్థానిక నాయకులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో నామమాత్రపు పనులు చేపట్టిన అధికారులు ఒక్కరోజు చేసి వదిలేసారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పార్క్ నిర్వహణను చేపట్టి చిన్నారులకు ఆటవిడుపు అందేలా, ఆట వస్తువులు అందుబాటులోకి తెచ్చేలా చూడాలని కార్మిక కుటుంబాలు కోరుతున్నాయి.