జైపూర్, ఫిబ్రవరి 18: ఎలక్ట్రిక్ చార్టింగ్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) సత్యనారాయణ సూచించారు. జైపూర్‌లోని ఎస్టీపీపీలో అధికారులకు అద్దె ప్రతిపాదికన ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ చార్జింగ్ వాహనాలను ఆదివారం అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ చార్జింగ్ వాహనాల వినియోగం పెరిగితే పర్యావరణాన్ని కాపాడినట్లవుతుందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్‌తో పోల్చితే వీటి నిర్వహణ ఖర్చు కూడా తక్కువని తెలిపారు. రానున్న కాలంలో అద్దె ప్రతిపాదికన మరిన్ని వాహనాలను పెంచుతామని తెలిపారు. జీఎం బస్వీరెడ్డి, సీఎంవోఐ అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్, పీఎం రామాశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.